సాగర్‌లో హైడ్రో ఎయిర్‌పోర్టుకు సర్వే


Tue,April 16, 2019 12:27 AM

Survey to Hydro Airport in Sagar

నందికొండ: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో హైడ్రో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు తెలంగాణ ప్రభు త్వం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. సోమవారం ఐదుగు రు సభ్యులతో కూడిన సర్వే బృందం నాగార్జున సాగర్‌లోని వివిధ ప్రాంతాల్లో సర్వే నిర్వహించింది. నాలుగు రోజులపాటు ఈ బృందం డ్యాం బ్యాక్ వాటర్, చిల్డ్రన్స్ పార్క్, విజయవిహార్ వెనుక ప్రాంతాలను స్థాయిలో సర్వే చేయనున్నట్టు సాగర్ డీఈ సాలమ్మన్‌రాజు తెలిపారు. కేంద్ర విమానయాన మం త్రిత్వశాఖ సాగర్ లో హైడ్రో ఎయిర్‌పోర్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీన్ని సాగర్‌లో ఏర్పా టు చేయడం ద్వారా హైదరాబాద్, ఆంధ్రాలోని విజయవాడ నుంచి ఈ ప్రాంతానికి 9, 12, 20 సీట్ల సామర్థ్యం గల చిన్నవిమానా లు నడిపిస్తారని అధికారులు తెలిపారు.

365
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles