కోస్తాలో కోడి పందాలకు సై!


Sat,January 13, 2018 02:39 AM

Supreme Court Final Verdict On Sankranthi Kodi Pandalu

-హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి తెరవెనుక ఏర్పాట్లు
-అడ్డుకునేందుకు అధికారుల కసరత్తు

KODIPANDALU హైదరాబాద్ / అమరావతి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి హైకోర్టు ఆదేశించినా.. సీఎం చంద్రబాబు వారించినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాలకు కళ్లెం పడే పరిస్థితి కనిపించడం లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు పోటీలకు సిద్ధపడుతుండగా.. నిర్వాహకులు దర్జాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సం క్రాంతి సందర్భంగా సరదాగా ఈ క్రీడను నిర్వహిస్తామని.. అవసరమైతే హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళుతామని నిర్వాహకులు తెగేసి చెప్తుతున్నారు. పందాలను కట్టడి చేయడం పోలీస్, రెవెన్యూ సిబ్బందికి సవాలుగా మారింది. పందాలను నిలువరించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్పాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. పందాలు జరిగితే అందుకు సీఎస్, డీజీపీలే బాధ్యత వహించాలని హెచ్చరించింది. పందాలు భారీగా జరిగే 43 ప్రాంతాల్లో తహసీల్దార్లకు ఇప్పటికే నోటీసులు జారీచేసినట్టు ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చింది.

అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం


పందాలను ఆపేందుకు పోలీసులు, అధికార యం త్రాంగం సిద్ధమవుతున్నది. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ పందాలను నియంత్రించే విషయంలో రాజీపడబోమని తేల్చిచెప్పారు. గ్రామాల్లో పందాలను నిర్వహిస్తే రెవెన్యూ ఉద్యోగులను బాధ్యులను చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదుచేసి రూ.లక్ష పూచీకత్తుపై విడుదల చేస్తున్నారు. గతంలో పందాల కోసం స్థలాలను ఇచ్చిన యజమానులకు నోటీసులిచ్చారు. కోళ్లకు కత్తులు కట్టే వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదుచేశారు.

చేతులు మారుతున్న కోట్ల రూపాయలు


ప్రతి సంవత్సరం కోడిపందాల మాటున కోట్లు చేతులు మారుతుంటాయి. ఈ ఏడాది పందాలు కాసేందుకు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యాపారులు తరలిరానుండడంతో కాకినాడ, యానాం, అమలాపురం, మలికిపురం, రాజోలు, తుని, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో లాడ్జీలు, రిసార్టుల్లో ముందస్తుగా బుకింగ్స్ నమోదయ్యాయి.

ఉత్తరాది నుంచి జాతి కోళ్లు


కాకిడేగ, కాకినెమలి, ఎర్రపొడ కోడి, తెల్లనెమలి, ఎర్రడేగ, పెట్టమారి, కాకిపెట్టమారి వంటి అరుదైన జాతి కోళ్ల ను పందాలకు ఉపయోగిస్తారు. ఈ జాతి కోళ్లను మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి ఇక్కడ పెంచుతున్నారు. ఒక్కో కోడికి రోజుకు మేత కోసం రూ.500 ఖర్చుచేస్తున్నట్టు సమాచారం. ఒక్కోకోడిని రూ. 50 వేల నుంచి 2లక్షలకు విక్రయిస్తున్నారు.

1969
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles