మెడికల్ డివైజెస్ పార్క్‌లకు తోడ్పాటు

Mon,November 11, 2019 01:23 AM

-సీఎఫ్సీ ఏర్పాటుకు రూ.25 కోట్ల వరకు సాయం
-దేశవ్యాప్తంగా నాలుగు పార్క్‌లకు నిధులివ్వాలని కేంద్రం నిర్ణయం
-సుల్తాన్‌పూర్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చిన 21 కంపెనీలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెడికల్ డివైజెస్ పార్క్‌కు సాయం చేయడానికి కేంద్రం ముం దుకొచ్చింది. తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ ఆ పార్క్‌ల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులోభాగంగా పార్క్‌లో కామన్ ఫెసిలిటి సెంటర్ (సీఎఫ్సీ) ఏర్పాటు కు కేంద్ర ఫార్మాస్యూటికల్ మంత్రిత్వశాఖ సహాయం చేయనున్నది. సీఎఫ్సీ ఏర్పాటుక య్యే ఖర్చులో 70 శాతం లేదా రూ.25 కోట్లు విడుదల చేయనున్నది. దీనిద్వారా పరిశ్రమల యజమానులకు మరింత ఊతం లభించనున్నది. ప్రస్తుతం దేశంలో అవసరమైన వైద్యపరికరాల్లో మూడోవంతు విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి.

దేశంలో దాదాపు రూ. 70 వేల కోట్ల మార్కెట్ ఉన్నది. ఇతర దేశాల నుంచి వైద్యపరికరాలను దిగుమతి చేసుకోవడంతో వాటి ధరలు అధికంగా ఉంటున్నాయి. వైద్యోపకరణాలను దేశీయంగా ఉత్పత్తి చేసుకోవడం వల్ల సామాన్యులకు భారం తగ్గనున్నది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్క్‌కు రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. గతేడాది మంత్రి కేటీఆర్ ఈ పార్క్‌కు శంకుస్థాపన చేయగా.. అదేరోజు 14 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. తర్వాత మరో ఏడుకంపెనీలు వచ్చాయి. పలు కంపెనీల నిర్మాణాలు చురుకుగా సాగిస్తున్నాయి. మరికొన్ని కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిద్వారా దాదాపు 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

99
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles