సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నచ్చక యువకుడి ఆత్మహత్య


Sat,September 14, 2019 02:02 AM

Suicide of a man who does not like a software job

హైదర్‌నగర్: చదువు పూర్తిచేసుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించిన ఓ యువకుడు.. ఆ ఉద్యోగంలో సంతృప్తి లభించక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకున్నది. కేపీహెచ్‌బీ ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. విశాఖపట్టణం దువ్వాడ ముస్తఫా సెంటర్‌కు చెందిన గుండ్ల వెంకటనాగచైతన్య (23) ఇంజినీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ టీఏ డిజిటల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నంబర్ 3లోని బాలాజీ హాస్టల్‌లో ఉంటున్న నాగచైతన్య రెండునెలల క్రితమే ఈ ఉద్యోగాన్ని సాధించాడు. ఈ ఉద్యోగంలో సంతృప్తి లభించక మనోవేదనకు గురవుతున్నట్టు మృతుడి వద్ద లభించిన లేఖలో ఉన్నదని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక తనలోతాను కుంగిపోయి హాస్టల్ గదిలోనే సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం హాస్టల్‌లోని తోటి మిత్రులు ఎంత పిలిచినా తలుపు తీయకపోవటంతో వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా.. అప్పటికే నాగచైతన్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ముందురోజు రాత్రే అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నాగచైతన్య మృతదేహాన్ని గాంధీ దవాఖాన మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

762
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles