ఇంటింటికీ శుద్ధజలాలు అద్భుతం


Thu,May 16, 2019 02:22 AM

successfully worked Mission Bhagiratha Telangana Drinking Water Projects

-మిషన్ భగీరథ పనితీరు భేష్
-కేంద్ర తాగునీటిశాఖ బృందం ప్రశంస
-జడ్చర్లలో క్షేత్రస్థాయి పరిశీలన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/జడ్చర్ల రూరల్: ప్రతి ఇంటికీ శుద్ధిచేసిన తాగునీరు అందించడం గొప్ప విషయమని, కేంద్ర తాగునీటిశాఖ డిప్యూటీ సలహాదారు డీ రాజశేఖర్ అన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుతో తెలంగాణ తాగునీటి అవసరాలు తీరుతున్నాయని చెప్పారు. వివిధ రాష్ర్టాల్లో తాగునీటి పథకాల పనితీరును పరిశీలించేందుకు కేంద్ర తాగునీటిశాఖ డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ నేతృత్వంలోని అధికారుల బృందం మూడురోజుల పర్యటనకు రాష్ట్రానికి వచ్చింది. బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లలో పర్యటించారు. నాగసాల వద్ద నిర్మించిన కేంద్రంలో నీటి శుద్ధిప్రక్రియను పరిశీలించారు. అనంతరం కేతిరెడ్డిపల్లె, నందారం గ్రామాల్లో పర్యటించి భగీరథ నీటి సరఫరాతోపాటు నీటి నాణ్యత, సరఫరా చేస్తున్న సమయాల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకొన్నారు.

భగీరథ నీళ్లు వచ్చినప్పటి నుంచి తాగునీటి కష్టాలు తీరాయని గ్రామస్తులు కేంద్ర బృందానికి తెలిపారు. భగీరథ నీళ్లు బాగున్నాయని, తాము అవే నీటిని తాగుతున్నామని గ్రామస్థులు చెప్పారు. అక్కడి నుంచి షాద్‌నగర్ నియోజకవర్గంలోని కమ్మదనంలో నిర్మించిన నీటిశుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. అన్నారం, బలిజరాల తండా గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఎంతో శ్రమకోర్చి తాగునీరు సరఫరా చేస్తున్నారని అధికారులను రాజశేఖర్ ప్రశంసించారు. కేంద్ర బృందంతోపాటు ఈ పర్యటనలో చీఫ్ ఇంజినీర్ చెన్నారెడ్డి, కన్సల్టెంట్ నర్సింగ్‌రావు, ఎస్‌ఈ సీతారాం, ఈఈలు వెంకట్‌రెడ్డి, పద్మలత, డీఈఈ శ్రీనివాస్‌గౌడ్ కూడా ఉన్నారు.

120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles