తెలంగాణ సహకారం మరువలేం

Sun,October 13, 2019 01:59 AM

-సదస్సు నిర్వహణలో మంత్రి కేటీఆర్‌ది కీలకపాత్ర
-డబ్ల్యూడీవో అధ్యక్షుడు శ్రీని శ్రీనివాసన్ ప్రశంస

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వరల్డ్ డిజైన్ అసెంబ్లీ విజయవంతంలో తెలంగాణ ప్రభుత్వ సహకారం మరువలేనిదని వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీవో) అధ్యక్షుడు శ్రీని శ్రీనివాసన్ కొనియాడారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఎంతగానో సహకరించారని, ఈ సదస్సు నిర్వహించడంలో ఆయన పాత్ర ఎంతో ఉన్నదని చెప్పారు. డబ్ల్యూడీవో నూతన అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా శ్రీనివాసన్ నమస్తే తెలంగాణతో మాట్లాడారు. అంతర్జాతీయ సదస్సు జరిగినప్పుడు ప్రభుత్వాలు షరతులు విధిస్తాయని, ఇక్కడ అలాంటిదేమీలేదన్నారు. డిజైనింగ్ రంగంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పారు.

హైదరాబాద్ డిజైన్ వీక్ నిర్వహణ మంచి ఆలోచన అని, కొచ్చి, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో కూడా దీన్ని అమలుచేయాలనే ఆలోచన ఉ న్నదని తెలిపారు. అంతర్జాతీయ సదస్సులు దేశంలో నిర్వహించే సందర్భంలో ఇతర దేశాల ప్రతినిధులు ఎప్పటికీ గుర్తుంచుకొనేలా వసతులు, ఏర్పాట్లు చేయడంలో హైదరాబాద్ ముందుందని కితాబిచ్చారు. డబ్ల్యూడీవో సభ్యత్వం పొందడానికి ప్రపంచంలోని పట్టణాలకు అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నామని.. హైదరాబాద్ తరహా నగరాలు సభ్యత్వం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. రెండు దశాబ్దాలుగా వినియోగదారుల ఆలోచనల్లో మార్పు లు వచ్చాయని, తదనుగుణంగా మార్కెట్‌లో నిలదొక్కుకోనేందుకు డిజైన్ రంగం తోడ్పడుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా డిజైన్ రంగం దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

భారతీయుడికి అధ్యక్ష హోదా

వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీవో) అధ్యక్షుడిగా శ్రీనిశ్రీనివాసన్ ఎన్నికయ్యారు. శనివారం హెచ్‌ఐసీసీలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2021 వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు. తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ లూమియం కంపెనీ సీఈవోగా ఉన్నారు. 2015-2017 వరకు డబ్ల్యూడీవో కోశాధికారిగా వ్యవహరించారు. 2017లో డబ్ల్యూడీవో ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయనకు భార్య సాన్‌జోస్, ఇద్దరు కుమారులు ఉన్నారు.

326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles