కాళేశ్వరానికి కట్టుదిట్టమైన భద్రత


Wed,June 12, 2019 01:30 AM

strict security for kaleshwaram project

-ప్రాజెక్టు పరిధిలోని పీఎస్‌లు టైప్ ఏకు అప్‌గ్రేడ్
-కాటారం వద్ద ట్రాఫిక్ పీఎస్.. పోలీస్‌శాఖ ప్రతిపాదనలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై పోలీస్‌శాఖ దృష్టి సారించింది. ప్రాజెక్టు రక్షణతోపాటు పరిసర ప్రాంతాల్లో భవిష్యత్‌లో పెరుగనున్న పర్యాటకుల రద్దీ దృష్ట్యా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టు పరిధి ప్రాంతాల్లోని నాలుగు పోలీస్‌స్టేషన్లను ఎఫ్ టైప్ నుంచి ఏటైప్‌గా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి నమస్తే తెలంగాణకు తెలిపారు. ఈ ప్రతిపాదనల్లో మేడిగడ్డ బరాజ్ పరిధిలోని పలిమెల, కన్నెపల్లి పంప్‌హౌస్ పరిధిలోని కాళేశ్వరం, అన్నారం బరాజ్ పరిధిలోని కొయ్యూరు, తుపాకులగూడెం బరాజ్ పరిధిలోని కన్నాయిపల్లి పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి.

ఎఫ్ టైప్‌లో ఉన్న ఈ పీఎస్‌లలో 29 మంది చొప్పున సిబ్బంది ఉన్నారు. ఏ టైప్‌గా అప్‌గ్రేడ్ అయితే ప్రతి పీఎస్‌లో సిబ్బంది సంఖ్య 120కి పెరుగుతుంది. స్టేషన్‌హౌస్ ఆఫీసర్‌గా ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారి వ్యవహరిస్తారు. ప్రతిసారి ఇతర విభాగాల పోలీసులను కేటాయించే అవసరం లేకుండా.. ప్రాజెక్టు పరిధిలోని పీఎస్‌లలో సిబ్బంది సంఖ్య ను పెంచడం ద్వారా నిత్యం భద్రతను పర్యవేక్షించేందుకు వీలవుతుంది. కాటారం వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం కాటారం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు పంపినట్టు ఐజీ నాగిరెడ్డి తెలిపారు.

657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles