పట్టిసీమ, చింతలపూడి ఆపేయండి


Wed,August 14, 2019 12:19 AM

Stop it Patisima Chintalapudi

-ఏపీ సర్కారుకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పర్యావరణ అనుమతులు లేని ఎత్తిపోతల పథకాలను నిలిపివేయాలని ఏపీ సర్కార్‌ను జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలని సూచించింది. గోదావరి, పెన్నా నదులపై ఎత్తిపోతల పథకాల వల్ల పర్యావరణం దెబ్బతింటున్నదని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, త్రినాథ్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై గతంలోనే విచారణ చేపట్టిన ఎన్జీటీ.. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతుంటే మీరేం చేస్తున్నారని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలిపై మండిపడింది.

89
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles