యాదాద్రికి చేరిన పంచలోహ విగ్రహాలు


Thu,June 20, 2019 02:13 AM

Statues reached yadadri pancaloha

-ఆరు మహారాజగోపురాలు, దివ్యవిమాన గోపురానికి కలశాలు
యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి గర్భాలయ ప్రధానద్వారానికి అమర్చనున్న నవ నారసింహుల పంచలోహ విగ్రహాలు, ధ్వజస్తంభానికి వినియోగించే రాగి వస్తువులు బుధవారం యాదాద్రికి చేరుకున్నాయి. రూ. కోటి వెచ్చించి వీటిని మహాబలిపురంలో తయారుచేయించారు. కొండపైన నిర్మించిన ఆరు మహారాజగోపురాలపైన ఏర్పాటు చేసేందుకు రాగి కలశాలు తయారయ్యాయి. అవసరమున్నప్పుడు బంగారుతాపడం చేసుకునేందుకు వీలుగా వీటిని రూపొందించారు. ఆర్కిటెక్టు ఆనందసాయి ఆధ్వర్యంలో స్థపతులు సుందరరాజన్, డాక్టర్ ఆనందాచార్యుల వేలు సూచనలతో మహాబలిపురంలో శిల్పి రాజేంద్రాచారి వీటిని రూపొం దిం చారు. 3,800 కి లోల రాగితో కలశా లు తయారు చేశా రు. గతంలో ఎక్క డా లేనివిధంగా శ్రీ వారి గర్భాలయం ప్రధానద్వారంపై నవ నారసింహుల పంచలోహ విగ్రహాలను అమర్చేందుకు నిర్ణయించారు. ప్రధాన ద్వారంపై హంసలు, పద్మాలు అమర్చి వాటికి బంగారు తాపడం చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహాబలిపురంలో కృష్ణశిలలతో తయారుచేస్తున్న స్టెయిర్‌కేస్ రెయిలింగ్ కొద్ది రోజుల్లోనే యాదాద్రికి వస్తుందని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీత తెలిపారు.

162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles