టీఎన్జీవోస్ పెద్దన్న పాత్ర

Tue,February 19, 2019 03:21 AM

-రాష్ర్టాభివృద్ధిలోనూ విశేష సేవలు: మండలి చైర్మన్ స్వామిగౌడ్
-కరీంనగర్‌లో టీఎన్జీవోస్ రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం

కరీంనగర్ స్పోర్ట్స్: ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో టీఎన్జీవోస్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నదని, కేవలం ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారానికే పరిమితం కాకుండా రాష్ర్టాభివృద్ధిలో ఉద్యోగుల తో కలిసి విశేష సేవలు అందిస్తున్నదని శాసన మండలి చైర్మన్ కే స్వామిగౌడ్ అన్నారు. టీఎన్జీవోస్ రెండో రాష్ట్రస్థాయి గేమ్స్, స్పోర్ట్స్ మీట్-2019ను సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో టీఎన్జీవోస్ సెంట్ర ల్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కారం రవీందర్‌రెడ్డి, మామిండ్ల రాజేందర్‌తో కలిసి స్వామిగౌడ్ ప్రారంభించారు. ఉమ్మడి పది జిల్లా ల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించగా అతిథులు గౌరవ వందనం స్వీకరించా రు. అనంతరం స్వామిగౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగులు క్షేమంగా ఉన్న రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మూడు రోజులపాటు జరిగే ఈ క్రీడాపోటీల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు, ఇతర సిబ్బందికి ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేసినందు కు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం లో ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్ర భుత్వ ఉద్యోగ నియామకాల్లో 2 శాతం స్పోర్ట్స్ కోటాను అమలు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్‌ను ఉద్యోగుల పక్షపాతిగా అభివర్ణించారు. మంత్రివర్గం ఏర్పడిన తరువాత.. ఉద్యోగులు ఆశించిన దానికంటే ఎక్కువగానే ఐఆర్, పీఆర్సీ అందే అవకాశం ఉన్నదన్నారు. అంతకుముందు ఉగ్రవాద దాడుల్లో మరణించిన జవానులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు, కోచ్‌లు, అఫీషియల్స్, మేనేజర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ జీ దేవీప్రసాద్‌రావు, టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అసోసియేట్ అధ్యక్షురాలు బీ రేచల్, టీఎస్‌పీఎస్సీ సభ్యుడు సీ విఠల్, రాష్ట్ర పోటీల కోఆర్డినేటర్, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ఎం కాళీచరణ్, దారం శ్రీనివాస్‌రెడ్డి, వీ రవీందర్, అన్ని జిల్లాల టీఎన్జీవోస్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles