ఏఐబీపీలకు నిధులివ్వండి


Fri,February 22, 2019 02:38 AM

State govt asks ULBs to earmark funds for road safety in Budget

-దేవాదుల, భీమాకు రూ.530.30 కోట్లు విడుదల చేయాలి
-కేంద్ర అధికారులను కోరిన సీఎస్
-దేవాదుల పనులను పరిశీలించిన ఏఐబీపీ అధికారులు..
-నేడు కాళేశ్వరం సందర్శన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద కొనసాగుతున్న దేవాదుల, భీమా ఎత్తిపోతల పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 530.30 కోట్లను వెంటనే విడుదలచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ అధికారుల బృందం గురువారం సీఎస్ ఎస్కే జోషితోపాటు నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశమయింది. ఈ సందర్భంగా ఏఐబీపీ కింద చేపట్టిన దేవాదులకు రూ.496.03 కోట్లు, భీమాకు రూ.34.274 కోట్లు ఇంకా రావాల్సి ఉందని.. వెంటనే విడుదల చేయాలని సీఎస్ కోరారు. ఈ సమావేశంలో కేంద్ర జలవనరులశాఖ కమిషనర్ (రాష్ట్ర ప్రాజెక్టులు) కే ఓహ్రా, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్ రంగారెడ్డి, నీటిపారుదలశాఖ ఈఎన్సీలు మురళీధర్‌రావు, నాగేంద్రరావు, కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేంద్ర జలవనరులశాఖ అధికారులు దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. శుక్రవారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను సందర్శించేందుకు వెళ్లనున్నారు.

కేంద్రం సహకారంతో చేపడుతున్న ప్రాజెక్టుల వివరాలు..

-క్యాడ్‌వామ్ కింద పదకొండు ప్రాజెక్టులకు సంబంధించి రూ.1,488.22 కోట్ల అంచనా విలువతో ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అందులో కేంద్రవాటా రూ.706.78 కోట్లు. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరులశాఖ దేవాదులకు రూ.10.77 కోట్లు, వరద కాల్వకు రూ.3.06 కోట్లు, మత్తడివాగుకు రూ.1.80 కోట్లు ఇప్పటికే ఇచ్చింది.
-2018-19 సంవత్సరానికి ఏడు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రూ.117.89 కోట్లకోసం అధికారులు ప్రతిపాదనలు పంపా రు. అవి కేంద్ర పరిశీలనలో ఉన్నాయి.
-చెరువుల పునరుద్ధరణకుగాను కేంద్రం అమలు చేస్తున్న త్రిపుల్ ఆర్ పథకం కింద నాలుగు దఫాలుగా రాష్ట్రం 575 చెరువులకు రూ.459.17 కోట్ల అంచనా విలువతో ప్రతిపాదనలు పంపింది. వీటిలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.272.02 కోట్లు. ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ.104.56 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.167.46 కోట్లు రావాల్సి ఉన్నది. 575 చెరువుల్లో ఇప్పటికే 164 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
sk-joshi-aibp2

626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles