దళిత యువత జీవితాల్లో వెలుగులు

Thu,November 14, 2019 04:00 AM

-ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం
-స్వయం ఉపాధికి చేయూత
-1,20,104 మందికి రూ.1336కోట్ల సబ్సిడీ రుణాలు
-వాహన కొనుగోలుకు ఊతం
-సర్కారు రుణాలతో ఓనర్లుగా మారిన డ్రైవర్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దళిత యువత జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. దళితయువత ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున కల్పించాలని ప్రభు త్వం సంకల్పించింది. అందుకనుగుణంగా భారీగా సబ్సిడీ రుణాలను అందజేస్తున్నది. డైవర్లుగా పనిచేస్తు ఇబ్బంది పడుతున్న యువకులు ప్రభుత్వరుణాలతో కార్లను కొనుగోలు చేసి ఓనర్లుగా మారారు. మరోవైపు నైపుణ్యం ఉన్న ఎస్సీ యువతకు రాష్ట్రప్రభుత్వం స్వయం ఉపాధి కల్పిస్తున్నది. 2014 నుంచి 2019 వరకు 1,20,104 మందికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.1336.21 కోట్ల సబ్సిడీ రుణాలు అందజేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికసహకార పథకం అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.222.34కోట్లు కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు లబ్ధిదారులకు కేవలం రూ. లక్షలోపు సబ్సిడీ రుణాలు అందజేయగా.. తెలంగాణ సర్కారు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.5లక్షల వరకు, 2017-18లో రూ. 12 లక్షలకు పెంచింది. కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చే సబ్సిడీ పోగా.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకురుణంగా అందజేస్తారు. రూ. లక్ష రుణం తీసుకున్న వారికి 80 శాతం సబ్సిడీ.. రూ. 2 లక్షల వరకు రుణం తీసుకున్న వారికి 70 శాతం, రూ. 2 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు రుణం పొందేవారికి ప్రభుత్వం 60 శాతం సబ్సిడీని అందజేస్తున్నది.

వాహనరంగంలో ప్రోత్సాహం

డ్రైవర్లుగా పనిచూస్తూ తమ కుటుంబాలను పోషించుకోలేక అవస్థ పడుతున్న దళిత యువతకు రాష్ట్రప్రభుత్వం అండగా నిలిచింది. రవాణారంగంలో విస్తరించిన ప్రైవేటుసంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని సబ్సిడీ రుణాణు అందజేసి డ్రైవర్లుగా ఉన్న దళిత యువతను ఓనర్లుగా మార్చింది.

రూ. 9.40 లక్షల చొప్పున సబ్సిడీ రుణం

2014-15 ఆర్థిక సంవత్సరంలో కార్ల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ. 9.40 లక్షల సబ్సిడీ రుణాన్ని, ఇతర వాహనాల కొనుగోలు కోసం 436 మందికి రూ.4.15 కోట్లు సబ్సిడీని ప్రభుత్వం అందజేసింది. 2015-16లో 540 మంది సబ్సిడీ రుణాలకు ఎంపికయ్యారు. వారికి రూ.22.02 కోట్లు ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చింది. ఇదేఏడాది 2081 మందికి ఇతర వాహనాల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.31.82 కోట్లు మంజూరు చేసింది. 2016-17లో 387 మందికి కార్లకొనుగోలు కోసం రూ.15.53 కోట్లు, ఇతర వాహనాల కొనుగోలు కోసం 926 మందికి రూ.16.33 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం అందజేసింది. 2017-18లో 645 మంది లబ్ధిదారులు సబ్సిడీని పొందారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం రూ.29.62 కోట్లు కేటాయించింది. ఇదేఏడాది ఇతర వాహనాల కోసం 769 మందికి రూ.16.36కోట్లు సబ్సిడీకి అందజేసింది. 2018-19లో వాహనకొనుగోలుకు రూ. 32 కోట్లు అందజేయగా.. 2019-20లో డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం కింద రూ.48.20 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.

1504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles