మైత్రివనంలోకి సచివాలయ ఆర్కైవ్స్


Wed,August 14, 2019 12:56 AM

State archives at Secretariat to be shifted to Maitrivanam

-అత్యంత జాగ్రత్తగా తరలించేందుకు అధికారుల కసరత్తు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సచివాలయంలో ఉన్న ఆర్కైవ్స్‌ను అమీర్‌పేటలోని మైత్రివనం (హెచ్‌ఎండీఏ భవనం)లోకి తరలించాలని నిర్ణయించారు. పాత ఫైళ్లను భప్రపరిచేందుకు మైత్రివనం కాంప్లెక్స్‌లో మూడు పెద్ద హాళ్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో సచివాలయంలోని ఆర్కైవ్స్‌ను మైత్రివనంలోకి తరలించేందుకు ఆర్కైవ్స్ విభాగం ఏర్పాట్లు చేస్తున్నది. ఆర్కైవ్స్‌లో పురాతన 20 లక్షల ఫైళ్లు ఉన్నాయి. వీటిని కదలిస్తే పొడిలాగా మారి కింద పడిపోయే అవకాశమున్నందున తరలింపునకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నది. శాస్త్రీయ పద్ధతుల్లో చర్యలు చేపట్టి వాటిని అత్యంత జాగ్రత్తగా తరలించేందుకు ఆర్కైవ్స్ విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు. సచివాలయం ఆర్కైవ్స్‌ను తరలించేందుకు అక్కడ కనీస స్థలం కూడా లేదు. దీంతో సచివాలయంలోని ఆర్కైవ్స్‌ను మైత్రీవనంలోకి తరలించాలని నిర్ణయించారు.

150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles