రెంటికి చెడ్డ రేవడి చంద్రబాబు


Tue,April 16, 2019 01:30 AM

srinivas goud fires on chandrababu naidu

-ఏపీ ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం తప్పదు
-తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు 16 సీట్లు ఖాయం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

నీలగిరి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చంద్రబాబు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. టీజీవోస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు ఉద్యోగ విరమణ పొందిన నేపథ్యంలో సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మం త్రి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించిన చంద్రబాబు కుంటి సాకులు వెతుకుతూ ఢిల్లీకి పోయి ఈవీఎంలపై దుమ్మెతి పోస్తున్నాడని మండిపడ్డారు. ఐటీకి కేరాఫ్ అని చెప్పుకునే చంద్రబాబు ఢిల్లీకిపోయి రాద్ధాంతం చేయ డం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా ప్రజలు చంద్రబాబుకు కర్రుకాల్చి వాత పెట్టడంతో మతి భ్రమించిందన్నారు. బాబు వైఖరిని చూసి దేశ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారనని తెలిపారు. కొత్త మున్సిపల్, రెవెన్యూ చట్టాలతో తెలంగాణ సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ సమాజమంతా సీఎం కేసీఆర్ వైపే నిలిచిందన్నారు. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకొని ఢిల్లీలో సీఎం కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

3311
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles