శారదాపీఠం ఉత్తరాధికారిగా బాలస్వామి


Wed,June 12, 2019 02:14 AM

Sri Shardapetam decided to surrender to Kiran Kumara Sharma

-శిష్యతురీయాశ్రమదీక్ష ప్రదానం చేయనున్న స్వరూపానందేంద్ర
-బెజవాడ దుర్గమ్మ పాదాలవద్ద 15-17 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం

వరకవుల దుర్వాసరాజు, హైదరాబాద్, నమస్తే తెలంగాణ : విశాఖ శారదాపీఠం బావిబాధ్యతలను ఇరవై ఆరేండ్ల బ్రహ్మచారి కిరణ్‌కుమారశర్మ (బాలస్వామి)కు అప్పగించాలని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీమహాస్వామి నిర్ణయించుకున్నారు. కుమారశర్మకు శిష్యతురీయాశ్రమ దీక్షను స్వయంగా ప్రదానం చేయదలిచారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో వేదవేద్యులు, ఆధ్యాత్మిక, రాజనీతి, కళారంగాల ప్రముఖుల సమక్షంలో బాలస్వామి సన్యాసాశ్రమ స్వీకరణ ఘనంగా నిర్వహించనున్నారు. బెజవాడ దుర్గమ్మ పాదాలవద్ద కృష్ణానదీతీరాన నెలకొన్న గణపతిసచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గాతీర్థం వేదికగా జరిగే కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి భక్తకోటి తరలిరానున్నది.

తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. కుమారశర్మ స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం. 1993 ఏప్రిల్ 4న విశాఖలో జన్మించారు. పోణంగి హనుమంతరావు, ప్రభావతమ్మ దంపతుల ఇద్దరు పిల్లల్లో పెద్దవాడు. మూడోతరగతి చదువుతుండగా తల్లిదండ్రులతో కలిసి స్వరూపానందేంద్రను దర్శించే భాగ్యం కలిగింది. బాలకిరణుడు.. మహాస్వామి కంటికి అపరశంకరునిగా గోచరించారు. వెంటనే పిల్లవాడ్ని పీఠానికి చేర్చమని తల్లిదండ్రులకు సూచించారు. నాటినుంచి కుమారశర్మ జీవితం మారిపోయింది. మహాస్వామి ప్రధాన శిష్యుడయ్యారు. ఆయన బాటలో ధర్మపరిరక్షణకు కృషిచేస్తానని కుమారశర్మ చెప్పారు.

బాలస్వామి యోగ్యుడు

ఆదిశంకరుడు, సచ్చిదానందేంద్రుడు, అద్వైతానందేంద్రుడు వీరి పరంపరగా శారదాపీఠం నడుస్తున్నది. దీనికి ఉత్తరాధికారిగా కిరణ్‌కుమారశర్మ వ్యవహరించబోతున్నారు. వీరి సన్యాసనామం దీక్ష స్వీకార సమయంలో వెల్లడిస్తాం. కుమారశర్మ యోగ్యుడు. వేదవేదాంగాలు చదువుకున్నవారు. వారి నేతృత్వంలో శారదాపీఠం మరిన్ని సత్కార్యాలు చేయనున్నది.
-స్వరూపానందేంద్ర స్వామి

687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles