-అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
-రంగనాయకసాగర్ పంప్‌హౌస్ పరిశీలన
చిన్నకోడూరు: త్వరలోనే గోదావరి జలాలు రంగనాయకసాగర్ రిజర్వాయర్‌కు రానున్నాయి. చెరువులు నింపడానికి కాల్వలపనులు త్వరితగతిన పూర్తిచేయాలి. త్వరలోనే కాల్వల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తా అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్- పెద్దకోడూరు గ్రా మాల శివారులోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ కట్ట, సొరంగం, పంపుహౌస్, ప్రధానకాల్వలను బుధవారం రాత్రి ఈఎన్సీ హరిరామ్తోకలిసి మంత్రి పరిశీలించారు. కట్ట పొడవునా తిరిగి పనులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సబ్‌స్టేషన్ పనులపై ఆరా తీశారు. గోదావరి జలాలు రిజర్వాయర్‌కు రాగానే చూడటానికి ప్రజలు పెద్దఎత్తున రానున్న నేపథ్యంలో భద్రతాచర్యలు చేపట్టాలని సూచించారు. మంత్రి వెంట కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ ఆనంద్, ఈఈ రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ తదితరులు ఉన్నారు.