పల్లెబాటలో పట్నం


Sun,January 13, 2019 02:46 AM

Special trains and buses to meet Sankranthi rush

-సంక్రాంతికి స్వగ్రామాలకు తరలుతున్న నగరవాసులు
-ప్రయాణికుల రద్దీతో బస్సు, రైల్వేస్టేషన్లు, రోడ్లు కిటకిట ప్రత్యేక బస్సులు, రైళ్లు ఫుల్
-మెట్రోలోనూ రికార్డుస్థాయి ప్రయాణికులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకోవడానికి హైదరాబాద్‌వాసులు పల్లెలకు తరలివెళ్తున్నారు. బంధువులు, స్నేహితుల మధ్య సంబురాలు చేసుకునేందుకు పల్లెబాట పట్టారు. దీంతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతోపాటు రహదారులు వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ పల్లెలతోపాటు ఆంధ్రప్రదేశ్‌నుంచి చాలా మంది వలసవచ్చి హైదరాబాద్‌లో ఉద్యోగులుగా, వ్యాపారులుగా, కార్మికులుగా స్థిరపడ్డవారున్నారు. వీరందరికీ సంక్రాంతి ముఖ్యపండుగ కావడంతో స్వగ్రామాల్లో నిర్వహించుకునేందుకు కుటుంబాలతో బయలుదేరుతున్నారు. ప్రజలను చేరవేసేందుకు ఆర్టీసీ రెగ్యులర్ బస్సులతోపాటు 5,252 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. ప్రత్యేక బస్సులను ఈ నెల 10నుంచి 14వ తేదీ వరకు తెలుగు రాష్ర్టాలకు నడుపడంతోపాటు, తిరుగు ప్రయాణం కోసం కూడా బస్సులను ఏర్పాటు చేస్తున్నది. దక్షిణమధ్య రైల్వే పండుగకు కొన్ని నెలల ముందే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటివరకు 203 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నది. ఇందులో 60 అన్‌రిజర్వ్‌డ్ రైళ్లు ఉన్నాయి. దీంతో నగరంలోని కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్లతోపాటు, జేబీఎస్, ఎంజీబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, లక్డీకాపూల్, మియాపూర్, అమీర్‌పేట తదితర ముఖ్యప్రాంతాలు రద్దీగా మారాయి. ప్రయాణికులు ఉప్పల్, ఎల్బీనగర్, ఎంజీబీఎస్, జేబీఎస్‌తోపాటు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు చేరుకోవడానికి మెట్రోరైలును ఆశ్రయిస్తున్నారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే 2.41 లక్షల మంది ప్రయాణించారని, ఇంది మెట్రోరైలు చరిత్రలో మొదటిసారని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
BUS-STATION1
BUS-STATION2

2600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles