ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్లకు అధికారాలు పెంచాం


Sat,July 20, 2019 03:39 AM

Special Powers to Collectors in New Municipal Act

భూగోళంపై మానవజాతి ఉన్నంతకాలం మానవ సంబంధమైన సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్యలు అనంతమైనవి. అమెరికా, యూరప్‌లాంటి దేశాల్లోనూ సమస్యలున్నాయి. ముప్ఫైఏండ్ల క్రితం చేసిన చట్టం ఇప్పుడు సరికాకపోవచ్చు. సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా మార్పులు చేయాల్సిన బాధ్యత సమకాలీన సమాజంపై ఉంటది. ఆ సోయితోనే క్వెస్ట్‌ఫర్ ఎక్సలెన్స్ దిశగా పట్టణప్రాంత స్థానిక సంస్థలు పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకువచ్చాం. ఇందులో ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్లకు కొన్ని అధికారాలు కల్పించాం. ప్రభుత్వానికి, జిల్లాకు కేంద్ర బిందువు జిల్లా కలెక్టరేట్. ఆ ఇన్‌స్టిట్యూట్ శక్తిమంతంగా ఉండాల్సిందే. ఈ చట్టంలో కలెక్టర్లకు విశేష అధికారాలతోపాటు బాధ్యత కూడా పెంచాం. ఇది స్థానికసంస్థల అధికారాలను హరించడం కాదా! అని కొంతమంది భాష్యాలు చెప్తుంటారు. ఇప్పటిదాకా అధికారాలు ఇచ్చాం. ఏం జరిగింది? నిజాంపేట నిన్నటిదాకా గ్రామపంచాయతీ. అంతకుముందు గవర్నమెంట్లు శాసనసభలో చట్టం చేయడంద్వారా ఉదయం జీవో ఇయ్యాలి.. మధ్యాహ్నంకల్లా స్టే రావాలి. మళ్లా అది గ్రామపంచాయతీగా కొనసాగాలి! అక్కడ ఆరంతస్తుల బంగళాలున్నాయి. అదికూడా ఇప్పుడు పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజిన్లు కూడా తిరుగలేని పరిస్థితి. హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి విచ్చలవిడిగా కాకుండా ఒక నియంత్రణతో జరుగాలి. అందుకు చట్టాలు కఠినంగా ఉండాలి. జిల్లెలగూడ మున్సిపాలిటీని స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తిమేరకు మీర్‌పేట్ మున్సిపాలిటీలో కలిపాం. ఇప్పుడు రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి. నగర పంచాయతీలు అనేవి ఇక ఉండవు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు.. ఈ రెండే ఉంటాయి. అన్నింటికీ చట్టప్రకారం నిధులు, హోదా ఉంటాయి.

కలెక్టర్ల పాత్ర పెంచినం..

మంత్రి అధికారాన్ని తీసేసినం జిల్లా కలెక్టర్ల పాత్ర పెంచినం. నియంత్రణ పెంచినం. అధికారాలు ఇచ్చినం. ఇప్పుడు కూడా సర్పంచ్‌లను సస్పెండ్‌చేసే అధికారం కలెక్టర్లకే ఉన్నది. అయితే ఏమైంది? నిధులు దుర్వినియోగమయ్యాయని దొరకబట్టి ఉదయం పదిగంటలకు సర్పంచ్‌ని కలెక్టర్ సస్పెండ్ చేస్తడు.. ఆ సర్పంచ్ 11 గంటలకు ఎమ్మెల్యే దగ్గర తేలుతడు. 12 గంటలకు ఆ ఎమ్మెల్యే మంత్రి దగ్గర తేలుతడు. ఒంటిగంటకు స్టే వస్తది. రెండు గంటలకు సర్పంచ్.. కలెక్టర్ దగ్గర కాలర్ ఎగరేసుకొని కూర్చుంటడు. ప్రస్తుతమున్న పరిస్థితి ఇది. కానీ, ఇప్పుడు మంత్రికి స్టే ఇచ్చే అధికారాన్ని తీసేసినం. అప్పుడు ఎమ్మెల్యే మీద ఒత్తిడి తగ్గుతది. ఇంట్లో తల్లి పిల్లలను గారాబంగా, ప్రేమగా, అనురాగంగా పెంచుతది. కానీ అదే తల్లి.. పిల్లగాడు ఎక్కువ చికాకుచేస్తే చెంపమీద ఒకటి కొడుతది. అంతమాత్రాన ఆ పిలగానికి దెబ్బతగలాలని తల్లి కొడుతదా? కొట్టదు! ఆతను నియంత్రణలో ఉండాలని కొడుతది తప్ప.. శిక్షించాలని కొట్టది! ప్రభుత్వం కూడా అంతే. దేనికోసం గెలిచామో దానికోసం పనిచేయాలి. దేనికోసం అధికారిగా నిలబడ్డామో ఆ పనిచేయాలి. గతంలోలాగా నిధులు దుర్వినియోగంచేస్తే స్టే తెచ్చుకునే అధికారం సర్పంచ్, మేయర్, చైర్మన్లకు లేదు.

1131
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles