ఎంజీఎంలో మెరుగైన వైద్యసేవల ప్రత్యేక నిధి


Fri,July 12, 2019 01:42 AM

Special fund for enhanced medical services at MGM hospital

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: ఉత్తర తెలంగాణ వైద్య సేవల్లో కలికితురాయి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యసేవల మె రుగు కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం యోచిస్తున్నది. ప్రభు త్వం అందించే ఆర్థిక తోడ్పాటుకు ఎన్‌ఆర్‌ఐ సహా ప్రముఖుల నుంచి విరాళాల రూపంలో ని ధులు సేకరించాలని భావిస్తున్నారు. ఉమ్మడి వ రంగల్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్తలు, వి విధ రంగాల్లో స్థిరపడిన వారి నుంచే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న వరంగల్ వాసుల నుంచి నిధుల సేకరించాలనుకుంటున్నారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ చైర్మన్‌గా ఆస్పత్రి విరాళ సేకరణ నిధి పేరిట బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాలని భావిస్తున్నారు.

గురువారం ఎంజీఎం సూపరింటెండెంట్ కార్యాలయంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ ఆస్పత్రి వైద్యసేవలపై సమీక్షించారు. ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించిన అనంతరం కలెక్టర్ గురువారం సమీక్షించారు. ఎంజీఎం అభివద్ధి కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్, ఎంజీఎం చైర్మన్ పేరుతో ప్రత్యేక అకౌంట్ ఏర్పాటు చేసి దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆస్పత్రిలో వివిధ విభాగాల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

75
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles