వయోవృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు


Fri,December 7, 2018 03:38 AM

Special facilities for older persons

ఓటింగ్ కేంద్రం వరకు రవాణా సదుపాయం మడత మంచాలు కూడా
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వృద్ధులు, వయోవృద్ధులు తమ ఓటుహక్కును సౌకర్యవంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారు అమితోత్సాహంతో ఓటు వేసే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో కనీవినీ ఎరుగుని రీతిలో ఎన్నికల సంఘం ఈ వినూత్న సదుపాయాలను ఈ దఫా కల్పిస్తున్నది.
పౌరుని ప్రాథమిక హక్కు ఓటు. దీనిని ముఖ్యంగా వృద్ధులు పూర్తి సౌకర్యవంతంగా వినియోగించుకోవాలన్నది ఎలక్షన్ కమిషన్ అభిప్రాయం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, రాష్ట్రంలో 18-19 ఏళ్ల యువకులలో 5,75,506 మంది ఓటర్లుగా నమోదు కాగా, ఇలాంటి వారి ఉత్సాహం కంటే రెట్టింపు స్థాయిలో వృద్ధులు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నట్టు తెలుస్తున్నది.

వృద్ధుల సంఖ్య తక్కువేమీ లేదు!

వృద్ధుల సంఖ్య తక్కువేమీ లేదు కాబట్టే, ఎన్నికల సంఘం వారికి సౌలభ్యం కలిగించే విషయమై ఆలోచిస్తున్నది. 70 ఏళ్లకు పై బడిన ఓటర్లందరికీ రవాణా తదితర సౌకర్యాలు కల్పించి వారితో సౌలభ్యకరంగా ఓటు వేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 100 ఏళ్లకు పైబడిన వృద్ధులు 2,472 మంది ఉండగా, 80- 100 ఏళ్లలోపు వారు 2,93,729 మంది ఉన్నారు. అలాగే, 70- 79 ఏళ్ల వరకు 9,31,135 మంది ఓటర్లు ఉండగా, 60- 69 ఏళ వయస్సు వారు 21,14,509 మంది జాబితాలో చోటు చేసుకున్నారు.

రవాణా సౌకర్యం, మడతమంచాలు

70- 100 కంటే ఎక్కువ వయసున్న వయోవృద్ధులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఓటు వేయడానికిగాను వారికి ప్రత్యేక రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. బూత్‌స్థాయిగా వృద్ధులను గుర్తించి వారికి అనుకూలంగా ఆటోలు, రిక్షాలు, అవసరమైతే కార్లు, మొబైల వ్యాన్లు వంటి వాహనాలను అందుబాటులో ఉంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వీరికి పోలింగ్ కేంద్రం లో ప్రత్యేక సదుపాయాలతోపాటు అక్కడ ఆలస్యమైతే వేచి ఉండేందుకు కొన్ని మడతమంచాలు సైతం సిద్ధంగా చేస్తున్నారు. వీరిని నేరుగా పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లి ఓటు వేయించవచ్చు. అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు సేద తీరేందుకూ చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా వీల్ చైర్లు, మంచి నీరు, ప్రాథమిక చికిత్స కోసం వైద్యులను కూడా వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

1209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles