రద్దీకి సరిపడా బస్సులు కానరాని సమ్మె ప్రభావం

Tue,October 22, 2019 03:27 AM

- విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
- సోమవారం యథావిధిగా నడిచిన వాహనాలు
- సాధారణ స్థితికి ప్రజారవాణా

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలతో ప్రజలు ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాగిస్తున్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో సోమవారం విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను నడిపించారు. రద్దీకి సరిపడా బస్సులు నడుపుతుండటంతో 17వ రోజూ సమ్మె ప్రభావం కనిపించలేదు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సు సర్వీసులను యథావిధిగా తిప్పగా, ప్రజారవాణా సాధారణ స్థితికి చేరుకొంటున్నది. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రంగారెడ్డి జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ హరీశ్‌, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ప్రవీణ్‌రావు, డీఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాపరిధిలోని 11 డిపోల నుంచి 471 ఆర్టీసీ, 209 అద్దె బస్సులు, 250 ప్రైవేట్‌ బస్సులు, 320 మ్యాక్స్‌క్యాబ్‌లు నడిచాయి. వికారాబాద్‌ జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి డిపోల నుంచి 198 బస్సు లు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేశాయి. యాదాద్రిభువనగిరి జిల్లాలో అధికారులు 99 బస్సులను నడిపించారు. పట్ట ణం నుంచి మారుమూల గ్రామాలకూ బస్సులు తిరిగాయి. యాదగిరిగుట్ట డిపో పరిధిలో 48 ఆర్టీసీ, 13 అద్దె బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్లాయి.

ఖమ్మంలో..

ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోల పరిధిలో బస్సులు యథావిధిగా నడిచాయి. విద్యార్థులకు అనుకూల సమయాని కి అధికారులు బస్సులను తిప్పారు. పాసులను సైతం అనుమతించారు. ఖమ్మం డిపోలో 65, మధిర డిపోలో 34, సత్తుపల్లి డిపోలో 64 ఆర్టీసీ బస్సులు వివిధ ప్రాంతాలకు నడిచాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మూడు డిపోల లో 161 బస్సు సర్వీసులు నడిచాయి.
TSRTC1

కరీంనగర్‌ రీజియన్‌లో..

కరీంనగర్‌ రీజియన్‌లోని నాలుగు జిల్లాల్లో 94.66 శాతం బస్సులు నడిచాయి. 656 బస్సులు నడపాల్సి ఉండగా 432 ఆర్టీసీ, 189 అద్దె బస్సులు నడిపినట్టు ఆర్‌ఎం జీవన్‌ ప్రసాద్‌ తెలిపారు. వరంగల్‌ రీజియన్‌ పరిధిలో యథావిధిగా బస్సులు తిరిగాయి. 9 డిపోల్లో 866 బస్సులకు 672 బస్సులు వివిధ ప్రాంతాలకు నడిచాయి.

నిజామాబాద్‌ రీజియన్‌లో..

నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో 429 బస్సులు నడవగా, అన్ని బస్టాండ్లు రద్దీగా మారాయి. ఉద యం నుంచి రాత్రి వరకు బస్సులు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురికాలేదు. విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రిప్పులు పెంచారు. ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ డిపోల పరిధిలో సోమవారం 177 వాహనాలను అందుబాటులో ఉంచారు. నిర్మల్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. విద్యాసంస్థలు తెరుచుకోవడంతో విద్యార్థులు, ప్రయాణికులతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. నిర్మల్‌, భైంసా డిపో పరిధిలో 314 బస్సు సర్వీసులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి.
TSRTC2

పాలమూరులో..

మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా 68 ఆర్టీసీ, 37 అద్దె బస్సులు నడిచాయి. వనపర్తి డిపోలోని వందశాతం ఆర్టీసీ, అద్దె బస్సులను పునరుద్ధరించారు. తెల్లవారుజాము 3 నుంచి రెగ్యులర్‌ షెడ్యూల్‌తో బస్సులను నడిపించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా రద్దీని బట్టి ఆయా రూట్లలో ఎప్పటికప్పుడు బస్సులను కేటాయించారు. బస్టాండ్‌ సమీపంలోని బస్సు పాస్‌ కౌంటర్‌ను తెరవడంతో విద్యార్థుల తమ పాసులను రెన్యువల్‌ చేసుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికారులు 74 ఆర్టీసీ బస్సులు, 20 అద్దె బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు.
TSRTC3

ప్రైవేటు బస్సు డ్రైవర్‌పై ఆర్టీసీ కార్మికుల దాడి

ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌పై ఆర్టీసీ కార్మికులు దాడి చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో సోమవారం చోటుచేసుకున్నది. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్‌ బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపి వెళ్తున్న సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ప్రైవేటు డ్రైవర్‌పై కార్మికులు దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ఆర్టీసీ కార్మికులను అక్కడి నుంచి పంపించివేశారు.

1367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles