పక్షపాతంలేకుండా సభను నడుపుతా


Sun,January 20, 2019 02:01 AM

Speaker Pocharam Srinivas Reddy Pays Tribute To Gandhi Statue At Assembly

-అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నూతనంగా ఎన్నికైన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఉదయం అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పీకర్‌గా దేశంలోని మహనీయులను గౌరవించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నియమ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశమిస్తానని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల సలహాలు, సూచనలు స్వీకరించి సభ సంప్రదాయాలను పాటిస్తానని వివరించారు. స్పీకర్ వెంట అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో సహా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలిలో చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ఎమ్మెల్సీలు వీ గంగాధర్‌గౌడ్, ఎం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎల్పీ నేతగా భట్టి.. స్పీకర్‌కు లేఖ

కాంగ్రెస్ శాసనసభాపక్షనేతగా మల్లు భట్టి విక్రమార్కను ఎన్నుకున్నట్టు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి లేఖను అందించారు. భట్టిని ప్రతిపక్షనేతగా గుర్తించాలని కోరారు. సీఎల్పీనేతగా ఎన్నికైన భట్టి విక్రమార్కకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయం ముందు తారసపడిన భట్టి విక్రమార్కను కేటీఆర్ పలుకరించి అభినందించారు.

pocharam-srinivas-reddy2

ప్రమాణం చేసిన రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌లో శనివారం ప్రమాణం స్వీకరించారు. సభ నియమావాళికి సంబంధించి కిట్ బ్యాగ్‌ను రాజాసింగ్‌కు స్పీకర్ అందించారు.

స్పీకర్‌గారూ.. వేములవాడకు రండి

మహాశివరాత్రి ఉత్సవాలకు రాజన్న దర్శనానికి రావాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి ఆహ్వానించారు.

1168
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles