ఎస్పీడీసీఎల్‌కు ఐసీసీ అవార్డులు

Fri,November 8, 2019 02:23 AM

-ఢిల్లీలో స్వీకరించిన సీఎండీ రఘుమారెడ్డి
-ప్రభుత్వ సహకార ఫలితమే ఈ ఘనత అని హర్షం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు ప్రతిష్ఠాత్మక ఐసీసీ అవార్డులు దక్కాయి. గురువారం న్యూఢిల్లీలో ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 13వ ఇండియా ఎనర్జీ సమ్మిట్ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ మాజీ సెక్రటరీ సుభాష్‌చంద్రగార్గ్ చేతుల మీదుగా టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి అవార్డులు అందుకున్నారు. ఓవరాల్ విన్నర్.. ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు, ఎఫిషియంట్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్ అవార్డు, టెక్నాలజీ అడాప్షన్ అవార్డు, పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్‌మెంట్ అవార్డులు దక్కాయి.

ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ప్రభుత్వం సహాయ సహకారాల ఫలితంగానే అవార్డులు దక్కాయని సంతోషం వ్యక్తంచేశారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేసి వినియోగదారులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పా రు. కచ్చితమైన విద్యుత్ బిల్లులు అందించడానికి ఐఆర్/ఐఆర్డీఏ ఆధారిత విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గేట్రర్ హైదరాబాద్‌లో విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు స్కాడా, డీఎంఎస్, సాసా వంటి ఆధునాతన పద్ధతులను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. విద్యుత్ నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారుల సమస్యల పరిష్కారంలో సంస్థ అవలంభిస్తున్న వినూత్న పద్ధతులకు ఈ అవార్డులు దక్కాయని తెలిపారు. సౌరవిద్యుత్‌లో సంస్థ చూపిన శ్రద్ధకు భారత ప్రభుత్వ జాతీయ పురస్కారం, ఐపీపీఏఐ పురస్కారం, ఐసీసీ అవార్డులు, స్కోచ్ తదితర అవార్డులు లభించాయని గుర్తుచేశారు. ఈ సందర్భంగా రఘుమారెడ్డి సంస్థ ఉద్యోగులకు, విద్యుత్ వినియోగదారులకు అభినందనలు తెలిపారు.

125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles