విఠల్‌రెడ్డి భూ సమస్యకు పరిష్కారం


Thu,May 16, 2019 02:16 AM

Solution to Vittal Reddy  land problem

-ఉన్నది కొంత.. రాసింది మరికొంత కథనానికి స్పందన
-ఎంజాయ్‌మెంట్ సర్వేకు జేసీ ఆదేశాలు

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ గ్రామానికి చెందిన దామెరపల్లి విఠల్‌రెడ్డి భూ సమస్యపై కరీంనగర్ జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ స్పందించారు. బుధవారం నమస్తే తెలంగాణలో ఉన్నది కొంత.. రాసింది మరికొంత శీర్షికతో వచ్చిన కథనంపై జేసీ స్పందించి, కరీంనగర్ రూరల్ తాసిల్ కార్యాలయానికి వెళ్లి స్వయంగా విచారణ జరిపారు. ఈ సర్వే నంబర్‌లో ఉన్న రైతులందరినీ పిలిపించి ఎవరికి ఎంత భూమి ఉన్నదో అడిగి తెలుసుకున్నారు. విఠల్‌రెడ్డికి పాత పట్టాదారు పాస్‌పుస్తకంలో ఉన్న భూమి ప్రకారం డిజిటల్ పాస్‌పుస్తకంలో ఎందుకు చేర్చలేదో అధికారులను అడిగారు. ఈ సర్వేనంబర్‌తో సంబంధం లేని ఓ రైతుకు భూమి రాశారని ఈ సందర్భంగా విఠల్‌రెడ్డి జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌కు వివరించారు. అతడిని కూడా విచారించిన జేసీ ఈ సర్వేనంబర్‌లో పూర్తి విస్తీర్ణాన్ని ఎంజాయ్‌మెంట్ సర్వే చేసి, ఎవరు మోకాపై ఉంటే వారికి పట్టా ఇవ్వాలని తాసిల్దార్ కుమారస్వామిని ఆదేశించారు. దీంతో ఏడాదికాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్న విఠల్‌రెడ్డి సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనున్నది. ఈ సందర్భంగా విఠల్‌రెడ్డి నమస్తే తెలంగాణకు ధన్యవాదాలు తెలిపారు.

462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles