స్వచ్ఛతెలంగాణ దిశగా సాగుదాం

Thu,December 5, 2019 02:45 AM

-విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించాలి: మంత్రి హరీశ్‌రావు

కొండపాక : ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పా టుచేసి స్వచ్ఛ తెలంగాణ దిశగా ముందుకు సాగుదామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వేద ఇంటర్నేషనల్ స్కూల్‌లో బుధవారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ భవిష్యత్ తరాలను కాపాడేందుకు నేటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు ముందుకు రావాలని అన్నారు. పాఠశాలస్థాయి నుంచే గుణాత్మకమైన విద్యతో విద్యార్థుల్లో మంచి లక్షణాలను పెంపొందించాలని సూచించారు. విద్యార్థిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు మంచి వేదికగా మారాయని అన్నారు. మగపిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటి కి వచ్చేంతవరకు వారు చేసే కార్యకలాపాలపై తల్లితండ్రులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు.

సైన్స్ ఫలాలు అందరికి చేరాలి:మంత్రి జగదీశ్‌రెడ్డి

సైన్స్ ఇచ్చిన అద్భుత ఫలాలు అందరికి చేరవేసే విధంగా విద్యార్ధులు ఎదగాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం భువనగిరి మదర్‌థెరిస్సా ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యావైజ్ఞానిక ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థులు మూఢ నమ్మకాలను దూరం చేసుకుని శాస్త్రీయతను అలవర్చుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇష్టమైన రంగాలను గుర్తించి, ఆ దిశగా వారిని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగడి సునీతామహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సింహారెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, డీఈవో చైతన్యజైని పాల్గొన్నారు.

నేటి నుంచి ఇచ్చోడలో రాష్ట్రస్థాయి గిరిజన విద్య, వైజ్ఞానిక సదస్సు

ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో గురువారం నుంచి రాష్ట్రస్థాయి గిరిజన విద్య, వైజ్ఞానిక సదస్సును నిర్వహిస్తున్నట్టు గిరిజన గురుకులాల సంస్థ ఓఎస్డీ శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 133 గిరిజన గురుకులాల పాఠశాలల నుంచి సుమారు 1,100 మంది విద్యార్థులుఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నారని చెప్పారు.

184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles