బస్సులో బంగారం స్మగ్లింగ్

Thu,December 5, 2019 02:01 AM

-చార్మినార్ వద్ద వ్యక్తి నుంచి 1.7 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అధికారుల కండ్లుగప్పి బంగారం దొంగరవాణాకు స్మగర్లు కొత్తదార్లు ఎంచుకుంటున్నారు. బస్సులో బంగారం తరలిస్తున్న ఓ వ్యక్తి.. డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులకు చిక్కాడు. ముందస్తు సమాచారం మేరకు డీఆర్‌ఐ బుధవారం చార్మినార్ వద్ద ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను చెన్నై నుంచి తిరుపతికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో సోదాలు జరుపగా నిందితుడు పట్టుబడ్డాడు. అతని వద్ద రూ. 66,64,000 విలువ చేసే 1.7 కిలోల విదేశీ మార్క్ బంగారు బిస్కెట్లు లభించాయి. ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో కస్టమ్స్ చట్టాల కింద అతన్ని అరెస్టు చేసినట్టు డీఆర్‌ఐ జోనల్ అదనపు డీజీ డీపీ నాయుడు తెలిపారు.

591
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles