రైతులకు ఎస్సెమ్మెస్ సేవలు


Tue,April 16, 2019 01:26 AM

sms Services to farmers

-ఫోన్‌కే కొనుగోలు కేంద్రాల సమాచారం
-జియో ట్యాగింగ్ ద్వారా నిఘా
-మరింత ప్రయోజనకరంగా ఓపీఎమ్మెస్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర చెల్లింపులకు సం బంధించి రైతులకు ప్రయోజనం కలిగేలా ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓపీఎమ్మెస్)ను పౌరసరఫరాలశాఖ మరింత అభివృద్ధిచేసింది. ఈ యాసంగి సీజ న్ నుంచి ఈ సాఫ్ట్‌వేర్‌ను అన్ని కొనుగోలు కేంద్రాల్లో(పీపీసీ) అందుబాటులోకి తెచ్చామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారాన్ని రైతులకు సెల్‌ఫోన్ ద్వారా అందించేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధిచేశామన్నారు. దీనిద్వా రా రైతులు ఎక్కడినుంచైనా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, బ్యాంకుఖాతా వివరాలను కూడా నమోదుచేయవచ్చని పేర్కొన్నా రు. ధాన్యం కేటాయించిన ఏడురోజుల్లోగా మిల్లుల నుంచి సమాచారం అందకపోతే.. అధికారులను అప్రమత్తంచేస్తూ సంక్షిప్త సందేశాలు వెళ్తాయన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు, మిల్లులపై నిఘా ఉంటుందని, మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం కేటాయించేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధిచేశామని పేర్కొన్నారు. ఓపీఎమ్మెస్ మొబైల్‌యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

గోదాముల్లో ఈవేయింగ్ మిషన్లు

రేషన్‌డీలర్లకు కచ్చితమైన తూకంతో నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో పౌరసరఫరాలసంస్థకు చెందిన 170 గోదాముల్లో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను(ఈవేయింగ్‌మిషన్) పౌరసరఫరాలశాఖ సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. వీటిని పౌరసరఫరాలభవన్‌లోని కమాండ్ కంట్రోల్‌సెంటర్‌కు, జిల్లాల్లోని మినీ కమాండ్ కంట్రోల్‌సెంటర్లకు అనుసంధానం చేస్తారు. దీనిద్వారా వేయింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా చూడవచ్చని అకున్‌సబర్వాల్ పేర్కొన్నారు.

1776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles