రహదారుల భద్రతకు స్మార్ట్ స్ట్రీట్స్ ల్యాబ్ ప్రారంభం


Fri,August 11, 2017 12:19 AM

Smart Streets Lab Launches Road Safety

-హైదరాబాద్, నమస్తే తెలగాణ: ఆధునిక పరిజ్ఞానంతో రహదారుల భద్రతను మెరుగుపర్చుకోవచ్చని రాష్ట్ర ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ చెప్పారు. రహదారుల భద్రతపై డబ్ల్యూఆర్‌ఐ ఇండియా- రాస్ సెంటర్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్‌స్ట్రీట్స్ ల్యాబ్ అనే వినూత్న కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అవసరమేనన్నారు. డబ్ల్యూఆర్‌ఐ ఇండియా- రాస్ సెంటర్ డైరెక్టర్ జ్యోతి చడ్డ్దా మాట్లాడుతూ స్మార్ట్ స్ట్రీట్ ల్యాబ్ ప్రయోగంతో రోడ్డు ప్రమాదాల్ని నిరోధించవచ్చని చెప్పారు. ఐఎస్‌బీహెడ్ అరుణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్మార్ట్ స్ట్రీట్స్ ల్యాబ్‌లో భాగంగా తెలంగాణ ఐటీ విభాగం హైదరాబాద్ వీధులను సుందరంగా తీర్చిదిద్దడానికి సరికొత్త డిజైన్ల కోసం ఆన్‌లైన్ పోటీలు ఏర్పాటు చేసింది. www. wricitieshub.org/ smartstreestslabలో దరఖాస్తులను నమోదు చేయాలని డబ్ల్యుఆర్‌ఐ ఇండియా- రోస్ సెంటర్ తెలియజేసింది.

పెరుగుతున్న ప్రమాదాలు: కేంద్రం వెల్లడి
ద్విచక్రవాహనాల వినియోగం పెరిగి, రహదారుల భద్రతపై పెనుప్రభావం పడిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తాజా నివేదిక వెల్లడించింది. 2014 నుంచి 2015 దాకా భారత్‌తో 2.5 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, దుర్మరణం పాలైన వారి శాతం 4.6కు చేరుకున్నదని గాయపడ్డవారి సంఖ్య 1.4 శాతం అధికమైందని తెలిపింది.

976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles