- ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ వినోద్‌కుమార్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అధికారులకు సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై బుధవారం ఆయన అధికారులతో ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధికి ఎన్నో అవకాశాలున్నాయని, ప్రణాళికాబద్ధ కార్యాచరణతో వాటిని నిరుద్యోగ యువతకు అందించాలని తెలిపారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాస్‌రావు, టాస్క్ సీఈవో శ్రీకాంత్‌సిన్హా, అధికారులు మధుకర్‌బాబు, ప్రశాంత్ పాల్గొన్నారు.