పశుసంవర్ధకశాఖ పనితీరు భేష్


Thu,May 16, 2019 02:26 AM

SK Joshi appreciated Animal Husbandry Department

-ఈ శాఖను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సూచన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పశువైద్యశాలల ఆధునీకరణకు పశుసంవర్ధకశాఖ చేపట్టిన చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రశంసించారు. రాష్ట్రంలో రూ.12.18కోట్లతో సుమారు 600 ప్రాథమిక పశువైద్యశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చారు. భవనాలకు రంగులు, ఫ్లోరింగ్, నీటితొట్లు, ప్రహరీగోడల నిర్మాణంలో పశుసంవర్ధకశాఖ పనితీరును సీఎస్ అభినందించారు. బుధవారం పశుసంవర్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, అదనపు సంచాలకుడు డాక్టర్ రామచందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మతులకు చేపట్టిన పనులను వివరిస్తూ రూపొందించిన ఫొటోఆల్బంను జోషికి అందజేశారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో 2,111 పశువైద్యశాలలు కొనసాగుతున్నాయి.

ఇందులో 900 ప్రాథమిక పశువైద్యశాలలు ఉన్నాయి. వీటిలో 2018-19 సంవత్సరంలో రూ.12.18 కోట్లతో రాష్ట్రంలోని సుమారు 600 ప్రాథమిక పశువైద్యశాలలకు మరమ్మతులతోపాటు, మౌలిక వసతులను పంచాయతీరాజ్‌శాఖ సహకారంతో చేపట్టారు. ప్రతి భవనానికి రూ.2 లక్షల వరకు వెచ్చించారు. ప్రాథమిక పశువైద్యశాలల ఆధునీకరణ పనులను కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రాష్ట్రంలో పశుసంవర్ధకశాఖను స్ఫూర్తిగా తీసుకొని ఇతర శాఖలు పనిచేయాలని ఈ సందర్భంగా సీఎస్ ఎస్కే జోషి ట్వీట్ ద్వారా అభిప్రాయం వ్యక్తంచేశారు. మొదటి విడుత లభించిన ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని మరో 600 పశువైద్యశాలల మరమ్మతులు చేపట్టనున్నట్లు సుల్తానియా తెలిపారు.

అర్బన్‌పార్కుల ప్రగతిపై నేడు సీఎస్ సమీక్ష

పట్టణ ప్రజలకు పర్యావరణాన్ని, ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 50 అర్బన్ లంగ్‌స్పేస్ పార్కులను నవంబర్ అందుబాటులోకి తేనున్నారు. వాటి ప్రగతిపై సీఎస్ ఎస్కే జోషి ఆధ్యక్షతన గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరుగనున్నది.

95
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles