కాగజ్‌కాంతులు


Mon,June 17, 2019 02:10 AM

Sirpur Paper Mill To Reopened in Kumaram Bheem Asifabad KTR Visit Sircilla

-సర్కారు చొరువతో తెరచుకున్న ఎస్పీఎం
-రోజుకు 25 నుంచి 30 టన్నుల కాగితం ఉత్పత్తి

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూ ర్ పేపర్‌మిల్లు సరికొత్త శోభను సంతరించుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యానికి గురైన సిర్పూర్ పేపర్‌మిల్లు.. తెలంగాణ సర్కారు చొరువతో పునఃప్రారంభమై వేలమంది కార్మికులకు ఉపాధినిస్తున్నది. గత ఫిబ్రవరిలో ఏడోనంబర్ యంత్రంతో ప్రారంభమైన ఉత్పత్తి.. నాలుగు నెలల్లోనే మరో మూడు యంత్రాల్లో కాగితాన్ని తయారు చేస్తున్నది. ప్రస్తుతం రోజుకు 25 నుంచి 30 టన్నుల కాగితం తయారవుతుండగా.. రోజుకు 300 టన్నుల వరకు ఉత్పత్తి చేసే లక్ష్యంతో యాజమాన్యం ముందుకెళ్తున్నది.

నిజాం కాలంలో ప్రారంభమై..

1938లో నిజాంకాలంలో సిర్పూర్ పేపర్ మిల్లు స్థాపించగా.. 1943లో ఉత్పత్తి ప్రారంభమైంది. 1950లో బిర్లాగ్రూప్ ఆధీనంలోకి వెళ్లింది. అప్పటి నుంచి కొన్నేండ్లపాటు పేపర్ ఉత్పత్తి నిరాటంకంగా సాగింది. కాగా 2007-08లో కంపెనీలో రెండు కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి ఉత్పత్తి మరింత పెంచే లక్ష్యంతో ఐడీబీఐ (ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాం క్ ఆఫ్ ఇండియా)లో మిల్లు ఆస్తులను తాకట్టు పెట్టి యాజమాన్యం రూ. 350 కోట్ల రుణాన్ని తీసుకున్నది. రుణాలను కంపెనీ అభివృద్ధికి వినియోగించకపోవడంతో నష్టాలు మొదలయ్యాయి. 2014 సెప్టెంబర్ 27న కంపెనీని షెట్‌డౌన్ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. కంపెనీ మూసేయం తో 3200 మంది కార్మికులు, పరోక్షంగా ఉపా ధి పొందే వందల మంది రోడ్డున పడ్డారు.

నాలుగు నెలల్లో మూడు యంత్రాల పునరుద్ధరణ

ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక రాయితీలతో ఎస్పీఎంలో యంత్రాల పునరుద్ధరణ వేగంగా సాగుతూ కాగితం ఉత్పత్తిని చేస్తున్నాయి. నాలుగు నెలల్లో మూడు యంత్రాల్లో కాగితం ఉత్పత్తి ప్రారంభమైంది. గత ఫిబ్రవరి 7న ఏడో నంబర్ యంత్రం ద్వారా ఉత్పత్తిని ప్రారంభించగా, మార్చి 30న 8వ యంత్రం, తాజాగా జూన్ 13న మూడో యంత్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు 25 నుంచి 30 టన్నుల కాగితం ఉత్పత్తి అవుతున్నది. మిల్లులోని మొత్తం యంత్రాలను ప్రారంభించి రోజుకు 300 నుంచి 350 టన్నుల పేపర్ ఉత్పత్తి చేసేందుకు యాజమాన్యం చర్యలు చేపడుతున్నది.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో..

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కంపెనీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. కంపెనీ తెరిచే కంపెనీలకు రాయితీలు ఇస్తామని 2016 సెప్టెంబర్‌లో రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వివిధ కంపెనీలతో ప్రయత్నాలు ప్రారంభించారు. 2016 అక్టోబర్ 22న ఐడీబీఐ ఎస్పీఎంను స్వాధీనం చేసుకున్నది. 2017 సెప్టెంబరులో 18న మిల్లు ఆస్తులపై నిర్ణయం తీసుకోవాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. 2017 డిసెంబర్‌లో జేకే కంపెనీ ఎస్పీఎంను తీసుకునేందుకు ముందుకొచ్చింది. 2018 మార్చి 18న ఎస్పీఎంను తీసుకునే కంపెనీకి పదేండ్లపాటు రాయితీలు కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2018 జూలై 19న పేపర్‌మిల్లును తెరిపించాలని ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. అదే ఏడాది ఆగస్టు 2న కేటీఆర్ చేతుల మీదుగా ఎస్పీఎం పునరుద్ధరణ పను లు ప్రారంభించారు. ఫిబ్రవరి 7న ఎస్పీఎంలో తిరిగి పేపర్ ఉత్పత్తి మొదలైంది.

1048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles