మలేషియా వ్యవసాయ క్షేత్రాల పరిశీలన


Tue,April 16, 2019 01:22 AM

singireddy niranjan reddy Touring in Malaysia for the study of farm fields

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వ్యవసాయ క్షేత్రాల అధ్యయానికి మలేషియాలో పర్యటిస్తున్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం అక్కడి ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను, రైతులు అవలంభించే అ త్యాధునిక పద్ధతులను పరిశీలించారు. మంత్రి తన అనుభవాలను ఎన్నారైలతో పంచుకున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా టీఆర్‌ఎస్ మలేషియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో కౌలాలంపూర్‌లో ఘనస్వాగతం పలికారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ మలేషియా విభాగం చేపట్టిన కార్యక్రమాలను మంత్రి కొనియాడారు. హెల్ప్‌లైన్ నంబర్ +60 1118772234 ద్వారా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నట్లు మలేషియా ఎన్నారై విభాగం తెలిపింది. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మారుతి కుర్మ, ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బోయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, జీవన్, రమేష్ గౌరు, సందీప్‌కుమార్, సత్యనారాయణరావు, నడిపెల్లి, రవితేజ, రఘునాథ్ నాగబండి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

80
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles