రెండోపంటకు సాగునీరు పుష్కలం


Wed,September 11, 2019 03:02 AM

singireddy niranjan reddy inspects peddamandadi branch canal in wanaparthy dist

-బడ్జెట్‌లో సింహభాగం వ్యవసాయశాఖకే
-సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
-మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/గోపాల్‌పేట/పెద్దమందడి: రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నందున రెండోపంట (యాసంగి)కు సాగునీరు పుష్కలంగా అందుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం పెద్దచెరువును, కుడి, ఎడమ కాల్వల ద్వారా ప్రయాణిస్తున్న నీటిని.. పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ జీరోపాయింట్ నుంచి 24 కిలోమీటర్ వరకు బైక్‌పై ప్రయాణిస్తూ కాల్వలను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మా ట్లాడుతూ.. బడ్జెట్‌లో సింహభాగం నిధులు వ్యవసాయరంగానికి కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రైతుబంధుకు రూ.12వేల కోట్లు, రైతుబీమాకు రూ. 1,137 కోట్లు, రుణమాఫీకి రూ.6వేల కోట్లు, ఉచిత కరంట్ రాయితీకి రూ.8వేల కోట్లు ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు భరిస్తున్నదని చెప్పా రు. మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ.27 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు.

వారానికో కాల్వను పరిశీలిస్తాం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వారానికో కాల్వను పరిశీలించనున్నట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వలను తనిఖీ చేసి, చుక్కనీరు కూడా వృథా పోనివ్వకుం డా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వలు పూర్తికానందున సీఎం ఆదేశాల మేరకు చెరువులు నింపుకొని ఆయకట్టుకు నీరందించే పనిలో నిమగ్నమైనట్టు తెలిపారు.

588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles