సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో..పోలీస్ అధికారిణిపై దోపిడీదొంగ దాడి..

Thu,June 20, 2019 03:25 AM

ias


-నగలు, నగదు దోచుకెళ్లిన ఆగంతకుడు
క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: దోపిడీ దొంగలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఏకంగా మహిళా పోలీస్ అధికారిపైనే దాడి చేసి నగలు, నగదు ఎత్తుకెళ్లారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నాన్‌క్యాడర్ ఎస్పీ ఎస్‌ఎం రత్న శనివారం సింహపూరి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్నారు. నెల్లూరులోని గూడూరు దగ్గరకు రైలు చేరుకున్న సమయంలో ఓ దోపిడి దొంగ బోగీలోకి ఎక్కి రత్నను బెదిరించి మెడలోని బంగారు గొలుసు, బంగారు గాజులు, బ్యాగ్‌లోని నగదును దోచుకున్నాడు. ఆగంతకుడిని అడ్డుకునేందుకు యత్నించిన మహిళా అధికారి రత్నపై అతడు దాడి చేసి పరారయ్యాడు. రత్న ముఖంతోపాటు చేతులు, మెడపై గాయాలయ్యాయి. నెల్లూరు ఎస్పీ గజరాజు భూపాల్ సంఘటన స్థలికి చేరుకొని ఆమెను నెల్లూరు దవాఖానకు తరలించి చికిత్స అందించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగ కోసం వేట సాగిస్తున్నారు.

6056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles