కవులు, కళాకారులకు నిలయం సిద్దిపేట

Sat,December 14, 2019 03:18 AM

-మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ: కవులు, కళాకారులకు నిలయం సిద్దిపేట అని, విపంచి కళావేదిక సాంస్కృతిక, సాహిత్య చర్చలకు వేదిక కావాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో నిర్మించిన విపంచి కళావేదికను మంత్రి ప్రారంభించారు. అంతకుముందు సిద్దిపేట రూరల్‌, చిన్నకోడూరు మండలాల్లో డబుల్‌ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలో 50 ఏండ్ల సమైక్య పాలనలో జరుగని అభివృద్ధి జరుగుతుందన్నారు. హరితహారంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని, జాతీయ స్థాయిలో ఏ అవార్డు వచ్చిన అందులో సిద్దిపేట ఉంటుందని చెప్పారు. సిద్దిపేటలో త్వరలోనే శిల్పారామాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. మరో రెండు నెలల్లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించుకోబోతున్నామన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్‌, రఘోత్తంరెడ్డి, బెవరేజేస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి పాల్గొన్నారు.

235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles