కవి నాళేశ్వరం శంకరానికి శ్రీశ్రీ పురస్కారం


Wed,June 12, 2019 02:09 AM

shri shri puraskaram For Poet Nalleswaram Sankara

త్యాగరాయ గానసభ:ప్రముఖ కవి డాక్టర్ నాళేశ్వరం శంకరంను కళానిలయం సంస్థ మహాకవి శ్రీశ్రీ పురస్కారాన్ని ప్రదానంచేసి మంగళవారం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన శంకరం కవి, విమర్శకుడు, పరిశోధకునిగా కీర్తి సాధించారు. ఓయూ నుంచి చలం రచనలపై పీహెచ్‌డీ పొందారు. దూదిమేడ కవితాసంపుటి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నాళేశ్వరం తెలంగాణ రచయితల సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. పలు సంస్థలు ఆయనను ఘనంగా సత్కరించి పురస్కారాలను ప్రదానం చేశాయి. ప్రపంచ తెలుగు మహాసభల్లో కవులకు ఆయన మార్గనిర్దేశనం చేశారు. కార్యక్రమంలో లలిత సంగీత గాయని హైమావతి భీమన్న, గానసభ అధ్యక్షుడు జనార్దనమూర్తి, కవి జల్దివిద్యాధరరావు తదితరులు పాల్గొన్నారు.

168
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles