మేడారం పై లఘు చిత్రాల పోటీ

Thu,December 5, 2019 01:31 AM

లుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ: ప్లాస్టిక్‌ఫ్రీ మేడారం జాతరపై లఘు చిత్రాల పోటీలను నిర్వహిస్తున్నట్టు ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో పోటీలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోటీలకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా సినీ దర్శకుడు వీర శంకర్, సభ్యులుగా సినీనటుడు శ్రీకాంత్, దర్శకుడు హరీశ్‌శంకర్, సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు వ్యవహరిస్తారని చెప్పారు. మొదటి బహుమతిగా రూ.75 వేలు, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ. 25 వేల నగదు అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఔత్సాహికులు www.innovativeads.co.in, [email protected], you tube.com /innovativeness అడ్రస్‌లకు జనవరి 5లోగా లఘు చిత్రాలను పంపించాలని కలెక్టర్ కోరారు.

66
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles