షైన్‌ఘటనపై దర్యాప్తు ముమ్మరం

Wed,October 23, 2019 02:02 AM

-ప్రమాదస్థలిని పరిశీలించిన దర్యాప్తు కమిటీ
-అన్ని విభాగాల నివేదికలు కోరిన పోలీసుశాఖ
-పూర్తిస్తాయి నివేదిక వచ్చాక కఠిన చర్యలు

హైదరాబాద్ సిటీబ్యూరో/ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ: దవాఖాన నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఐసీయూలో నాలుగు నెలల చిన్నారి మృతికి కారణమైన ఎల్బీనగర్ షైన్ చిల్డ్రన్ హాస్పిటల్ యాజమాన్యంపై కఠినచర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యుడు, వైద్యారోగ్యశాఖ అదనపు కార్యదర్శి రవీంద్రనాయక్ మంగళవారం దవాఖానను సందర్శించారు. ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఏసీపీ పృథ్వీధర్‌రావు, సీఐ అశోక్‌రెడ్డితో కలిసి అగ్ని ప్రమాదానికి కారణాలపై అధ్యయనం చేశారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి సోమవారమే ప్రాథమిక రిపోర్టు సమర్పించారని, తదుపరి విచారణ కోసం దవాఖానకు వచ్చానని రవీంద్రనాయక్ తెలిపారు.

ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై అన్నిశాఖల నుంచి సమాచారం సేకరించి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ఈ ఘటనపై అన్నివిభాగాల నివేదికలు ఇవ్వాలని కోరామని ఏసీపీ పృథ్వీధర్‌రావు తెలిపారు. డీఎంహెచ్‌వో, జీహెచ్‌ఎంసీ, ఫైర్, విద్యుత్‌శాఖ అధికారుల నుంచి అగ్నిప్రమాదానికి గల కారణాలపై నివేదికలు అడిగామని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం 304/ఏ ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదుచేసుకొన్న పోలీసులు, నివేదిక వచ్చాక యాజమాన్యంపై హత్యానేరం కింద కేసు నమోదుచేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పొనుగోటి అంజన్‌రావు, బృందాధర్‌రావు, అపర్ణ సైతం ప్రమాదస్థలిని పరిశీలించారు.
Shine-Hospital1

తొక్కిసలాట జరిగితే మరింత నష్టం

షైన్ దవాఖాన భవనానికి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించలేదు. ఎల్బీనగర్ ఇన్నర్ రింగ్‌రోడ్డులో రోడ్డుకంటే ఎత్తుగా ఉన్న భవనానికి ఒక పక్కన చిన్న మెట్లద్వారానే పైకి చేరుకోవాలి. సోమవారం తెల్లవారుజామున ప్రమాద సమయంలో దవాఖానలో సుమారు 70 మంది ఉన్నట్టు సమాచారం. ఐసీయూలో ఉన్న కింది అంతస్థులో ఉన్నవాళ్లు ప్రమాదాన్ని గుర్తించి చాకచక్యంగా కిందికిదిగారు. అందరూ ఒకేసారి దిగేందుకు ప్రయత్నిస్తే తొక్కిసలాట జరిగి ప్రమాద తీవ్రత పెరిగేది.

724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles