టీడీపీ నేతకు షాక్!


Sat,September 14, 2019 12:46 AM

Shock to TDP leader

-కబ్జాచేసిన భూమిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
అమరావతి: ప్రభుత్వం అండదండలతో విజయవాడ మధురానగర్‌లో టీడీపీ నేత, ఏపీ రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు కుటుంబం కబ్జాచేసిన ప్రభుత్వ భూమిని శుక్రవారం ఏపీ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కబ్జాచేసిన స్థలంలో కుటుంబరావు సోదరుడు పెట్టిన బోర్డులను అధికారులు తొలగించారు. స్థలం గేటుకు జేసీ మాధవీలత నోటీసులు అంటించారు. టీడీపీ హయాంలో కుటుంబరావు కుటుంబీకులు రూ.200 కోట్లకుపైగా విలువచేసే ప్రభుత్వ భూమిని చేజిక్కించుకున్నారు. న్యాయస్థానాలకు వాస్తవాలు తెలుపకుండా వివిధ శాఖలను మేనేజ్‌చేసి భారీగా లబ్ధి పొందిన విషయం ఇటీవల స్పందన కార్యక్రమానికి అందిన ఫిర్యాదుల ద్వారా వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరిపి, క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు.

889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles