షాపూర్‌ వీఆర్వో సస్పెన్షన్‌


Sat,August 24, 2019 02:07 AM

Shapur VRO suspended for demanding bribe

నందిపేట్‌ రూరల్‌: నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం షాపూ ర్‌ వీఆర్వో భూమన్న ను ఉన్నతాధికారులు సస్పెండ్‌చేశారు. గత సోమవారం గ్రామానికి చెందిన మహిళా రైతు రాజుబాయి తాసిల్‌ కార్యాలయానికి వచ్చి ఆన్‌లైన్‌లో పేరు మార్చేందుకు రూ.10 వేలు ఇచ్చానని, అయినా పనిచేయడంలేదంటూ వీఆర్వోను నిలదీశారు. దీనిపై మంగళవారం ‘పైసలిచ్చినా పనిచేయవా?’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. స్పం దించిన అధికారులు బాధితురాలికి న్యాయంచేశారు. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం శుక్రవారం వీఆర్వోను సస్పెండ్‌చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

437
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles