బాలిక గృహనిర్బంధం.. లైంగిక దాడి


Wed,June 12, 2019 01:25 AM

Sexual assault on minor girl

-మిర్యాలగూడలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం
మిర్యాలగూడ టౌన్: పదహారేండ్ల బాలికను మూడ్రోజులపాటు ఇంట్లో నిర్బంధించి లైంగికదాడికి పాల్పడిన ఘటన మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన ఓ బాలిక(16) ఆదివారం సమీపంలోని కిరాణ దుకాణం వద్దకు వెళ్లింది. అదే కాలనీకి చెందిన 17 ఏండ్ల వయస్సుగల ఇద్దరు బాలు రు బాలికను అపహరించారు. అందులోని ఓ బాలుడు తన ఇంట్లో నిర్బంధించి మూడ్రోజులపాటు లైంగికదాడికి పాల్పడ్డాడు. మరోవైపు బాలిక తల్లిదండ్రులు కూతురి ఆచూకీ కోసం గాలించి సోమవారం పోలీ సులను ఆశ్రయించారు. పోలీసులు సదరు బాలుడిని ప్రశ్నించగా బుకాయించి తప్పించుకొన్నాడు. మంగళవారం తెల్లవారుజామున బాలికను వదిలివేయడంతో ఇంటికి చేరింది. రక్తపుమరకలతో ఉన్న బాలికను తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. నిందితుడిపై మిస్సింగ్, అత్యాచారం, ఎస్సీఎస్టీ అట్రాసిటీ, పోస్కో కేసులు నమోదు చేసినట్టు వన్‌టౌన్ ఎస్సై రజినీకర్ తెలిపారు.

3401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles