కిషన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి


Tue,April 16, 2019 01:05 AM

Secunderabad TRS MP candidate in the High Court is the Election Agent petition

-హైకోర్టులో సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ పిటిషన్
-18లోగా వివరణ ఇవ్వాలని ఈసీకి న్యాయస్థానం ఆదేశం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎన్నికల నిబంధనలను ఉల్లఘించిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌యాదవ్ ఎన్నికల ఏజెంట్ గుర్రం పవన్‌కుమార్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారించింది. ఏ నిబంధనల ప్రకారం సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని న్యాయస్థానం ప్రశ్నించింది. పార్టీ గుర్తులతో కూడిన ఓటర్ స్లిప్పుల పంపిణీ, ఏక మొత్తంలో రూ.8 కోట్లు బ్యాంకు నుంచి డ్రా చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ అంశంపై ఈ నెల 5, 9వ తేదీల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఎన్నికల ఏజెంటు గు ర్రం పవన్‌కుమార్‌గౌడ్ ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్య లు చేపట్టిందో వివరించాలని ముఖీద్ కోరారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను ఈ నెల 18వ తేదీలోగా న్యాయస్థానానికి వివరణ ఇవ్వాలని ఈసీ తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్‌ని కోర్టు ఆదేశించింది.

116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles