హైదరాబాద్‌లో 144 సెక్షన్!

Thu,December 5, 2019 01:20 AM

-నేటి సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు..
-సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: డిసెంబర్ 6న బాబ్రీ ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రశాంతతకు భంగం కలుగకుండా ముందస్తు చర్య ల్లో భాగంగా గురువారం (ఈ నెల 5) సాయంత్రం 6 నుంచి శనివారం (ఈ నెల7) ఉదయం 6 గంటల వరకు నగరవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు, వ్యక్తిగతంగా ప్రసంగాలు, చిహ్నాలు, ప్లకార్డులు, జెం డాల ప్రదర్శనలు చేయవద్దని పేర్కొన్నారు. అనుమతిచ్చిన వ్యక్తులు, గ్రూపులతోపాటు వ్యక్తుల అంత్యక్రియల ఉరేగింపులకు మినహాయింపు ఉంటుందన్నారు.

556
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles