సచివాలయ నెట్‌వర్క్ తరలింపు ప్రారంభం

Thu,December 5, 2019 01:21 AM

-14 నాటికి పూర్తికానున్న ప్రక్రియ
-సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు కోసం ఆలస్యమైన ప్రక్రియ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సచివాలయ నెట్‌వర్క్‌ను బీఆర్కేభవన్‌కు తరలించే ప్రక్రియను ఐటీ అధికారులు ప్రారంభించారు. స్టేట్ వైడ్ ఏరియా నెట్‌వర్క్(స్వాన్), సెక్రటేరియట్ క్యాంపస్ నెట్‌వర్క్(స్కాన్), వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడానికి వీలుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లు ప్రస్తుతం పాత సచివాలయంలోనే ఉన్నాయి. వీటిని ఈ నెల 14వ తేదీనాటికి బీఆర్కేభవన్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి బీఆర్కే భవన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్ ద్వారా మంత్రులు, సీఎస్, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శుల ఇంటర్నెట్‌సేవలకు అంతరాయం లేకుండాచూస్తున్నారు.

సచివాలయం ఇంటర్నెట్ సేవలకు హ్యాకింగ్, సైబర్‌దాడుల నుంచి పూర్తిగా భద్రత కల్పించడానికి ఐటీ అధికారులు దాదాపు రూ.70 లక్షలతో అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటుచేశారు. దీంతో తరలింపు ప్రక్రియను వేగవంతంచేశారు. వాస్తవానికి సర్వర్లను బీఆర్కేభవన్‌కు తరలించినా ముఖ్యమైన కంట్రోల్ యూనిట్లు పాత సచివాలయలోని డీబ్లాక్‌లోనే ఉన్నాయి. అక్కడినుంచి నెట్‌వర్క్ కంట్రోల్ యూనిట్ల తరలింపు ప్రక్రియ పూర్తయితే అధికారులు, ఉద్యోగులందరికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. అత్యంత భద్రతతో ఏర్పాటుచేస్తున్న వ్యవస్థలో వీడియో కాన్ఫరెన్స్ కమాండ్ కంట్రోల్‌ను కనీసం ఇద్దరు నిపుణులు ఎల్లప్పుడూ మానిటరింగ్‌చేయాల్సి ఉంటుందని, ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నట్టు ఐటీ అధికారి ఒకరు తెలిపారు. ఐటీ నెట్‌వర్క్‌ను నవంబర్ 9లోగా తరలించాలని భావించినా సెక్యూరిటీ ఏర్పాట్లలో సాంకేతిక ఇబ్బందుల కారణంగా గడువు తీసుకున్నారు.

219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles