అంబేద్కరిజం కోసమే సమతా ఎక్స్‌ప్రెస్


Tue,April 16, 2019 01:26 AM

SCR revenue surges by 15 percent

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : అంబేద్కర్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రచారం చేసేందుకు భారతీయ రైల్వే సమతా ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిందని, ఆ మహనీయుడి జీవితంతో సంబంధమున్న ప్రదేశాలను కలుపుతూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తుందని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌మాల్యా అన్నారు. అంబేద్కర్ ఆదర్శాలకు అనుగుణంగా భారతీయరైల్వే పని చేస్తున్నదని, సంస్థాగత ప్రాధాన్యాలు ఏర్పర్చుకొని ముందుకు పోతున్నదని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో మాల్యా మాట్లాడు తూ.. కుల, మతాలకతీతంగా ప్రజలను ఏకం చేయడంలో అంబేద్కర్ చేసిన కృషికి యావత్‌జాతి రుణపడి ఉన్నదని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఎన్వీ రమాణారెడ్డి, డీఆర్‌ఎంలు ఆనంద్ భాటియా, అరుణ్‌జైన్, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ జోనల్ ప్రెసిడెంట్ వీవీ నాయక్, ఎస్‌సీఆర్‌ఈఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆండ్రూ, ఎస్‌సీఆర్‌ఎంయూ జనరల్ సెక్రెటరీ సీహెచ్ శంకర్‌రావు, ఎస్‌సీఆర్ ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రికార్డు ఆదాయం ఘనత సిబ్బందిదే

2018-19లో దక్షిణ మధ్య రైల్వే రికార్డుస్థాయి లో ఆదాయం సాధించిందని, ఇందుకు అధికారులు, సిబ్బంది కృషే కారణమని జీఎం గజానన్‌మాల్యా కొనియాడారు. రైల్‌కళారంగ్‌లో నిర్వహించిన 64వ రైల్వే వార్షికోత్పవాల్లో మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ పనితీరు ప్రదర్శించి జాతీయస్థాయిలో ఉత్తమజోన్‌గా నిలిచిందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి జోన్ 122.5 మిలియన్ టన్నుల సరుకు రవా ణాచేసి 19శాతం ఆధిక్యాన్ని నమోదు చేసిందన్నారు. సరుకు రవాణా ద్వారా ఆర్జించిన ఆదాయం మొట్టమొదటి సారి రూ. 10,000 కోట్లకు చేరిందన్నారు. సికింద్రాబాద్, విజయవాడ డివిజన్లకు సంయుక్తంగా ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్ ప్రదానం చేశారు.

401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles