ఆరోగ్యంపై చంద్రుడి ప్రభావం ఉంటుందా?

Tue,October 8, 2019 03:01 AM

చంద్రుడి గమనం మనుషుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందంటున్నారు సైంటిస్టులు. గ్రహగమనాల ప్రభావం రోజువారీ జీవితం మీద, ఆరోగ్యం మీద ఉంటుందని ఎప్పటినుంచో భారతీయుల నమ్మకం. అదేమీ వాస్తవదూరం కాదంటున్నారు పరిశోధకులు. పౌర్ణమి రోజుల్లో పగడపు జీవులు అండాలను విడుదలచేస్తాయి. అంటే వాటి ప్రత్యుత్పత్తి పైన చంద్రుడి ప్రభావం ఉంటుందన్నమాట. భూమి, చంద్రుడి మధ్య గల గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రంలో అలలు ఎగిసిపడతాయి. మనుషుల జీవప్రక్రియలపైనా చంద్రుడి ప్రభావం ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. మహిళల్లో నెలసరి చక్రం, చంద్రుడి స్థాయిల మధ్య సంబంధం ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. నెలసరి చక్రం సగటున 28 రోజులు ఉంటుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి పట్టే కాలం 27 రోజుల 7 గంటల 43 నిమిషాలు. మహిళల్లో నెలసరి, అండోత్పత్తి ప్రక్రియలకు పౌర్ణమి, అమావాస్యలకు సంబంధం ఉందని చెప్తున్నాయి అధ్యయనాలు. ఇకపోతే పౌర్ణమి సమయం నిద్రను డిస్ట్రబ్ చేస్తుందని కూడా తేలింది. 319 మందిపై చేసిన అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నది. మానసిక ఆరోగ్యంపైనా చంద్రుడి ప్రభావం ఉంటుంది. సాధారణంగా రాత్రి సమయంలో, అదీగాక పౌర్ణమి రోజున హింసాయుత ప్రవర్తన ఎక్కువవుతుందంటున్నారు.

649
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles