నేటినుంచి సహస్ర చండీయాగం

Sun,October 13, 2019 01:26 AM

కల్లూరు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని నారాయణపురంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపడుతున్న సహస్ర చండీయాగానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుంచి ఐదురోజులపాటు జరుగనున్న ఈ యాగంలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి పీఠాధిపతులు, 200 మంది ఋత్వికులు పాల్గొననున్నారు. ఈ నెల 16న త్రిదండి చినజీయర్‌స్వామి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సహస్ర కుంకుమార్చనలో మహిళలు పెద్దఎత్తున పాల్గొననున్నారు. ఇందుకోసం మాజీ ఎంపీ పొంగులేటి శనివారం ఏర్పాట్లను పరిశీలించారు.

97
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles