ఇక గ్రామాల్లో అభివృద్ధి పరుగులు


Mon,June 17, 2019 02:26 AM

Rural Development Works in Telangana Villages

-సంపూర్ణంగా అమలులోకి కొత్త చట్టం
-నేటినుంచి సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్
-నూతన పంచాయతీరాజ్ చట్టం నేపథ్యంలో మరోసారి మార్గదర్శకాలు
-జిల్లా, మండలం, గ్రామాలవారీగా విడుదల

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గ్రామాల్లో నూతన పంచాయతీరాజ్ చట్టం సంపూర్ణంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టాన్ని గతేడాది జూన్ నుంచే అమల్లోకి తీసుకువచ్చినా.. కొన్ని సెక్షన్లపై మినహాయింపు ఇచ్చారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్‌తోపాటు మొత్తం ఆరు అంశాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. తాజాగా శనివారం నూతన పంచాయతీరాజ్ చట్టంలోని 6(10), 34, 37(6), 43(10), 47(4), 70(4), 113(4), 114(2), 141 సెక్షనలను నోటీఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. దాంతో కొత్త పంచాయతీరాజ్ చట్టం సంపూర్ణంగా అమల్లోకి వచ్చినట్లయింది. గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేందుకు జాయింట్ చెక్‌పవర్ కల్పించనున్నట్టు చట్టంలో పేర్కొన్నారు. గతంలో కార్యదర్శితో కలిసి సర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్ ఉండగా.. ప్రస్తుతం ఆ పవర్‌ను సర్పంచ్, ఉప సర్పంచ్‌కు ఇచ్చారు. గ్రామాల్లో స్వచ్ఛత నిర్వహణ బాధ్యతను పాలకవర్గానికి కట్టబెట్టారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇక నుంచి ఇంటి ముందట చెత్త వేస్తే ఆ ఇంటి యజమానులదే బాధ్యత. ఇంటి ముందు చెత్త వేస్తే రూ.500, మురుగునీటిని రోడు ్డమీదకు వదిలితే రూ.5 వేలు జరిమానా విధిస్తారు. ఒక్కో కుటుంబం తమకు నిర్దేశించిన ప్రకారం తప్పనిసరిగా ఆరు మొక్కలు నాటాలి. వాటిలో కనీసం మూడు మొక్కలు ఎదిగేట్టుగా చూడాలి. మొక్కలను పెంచనివారికి ఆస్తిపన్నుకు రెండింతలు జరిమానా విధించేలా మార్గదర్శనాలు జారీచేశారు.

ప్రగతి సాధనే ప్రథమ లక్ష్యం

కొత్త చట్టాన్ని సంపూర్ణంగా అమల్లోకి రావడంతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా, మండలం, గ్రామాలవారీగా చట్టంపై అవగాహన తీసుకొస్తున్నారు. గ్రామాల ప్రగతి సాధనే లక్ష్యంగా కొత్త చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంటున్నారు. పంచాయతీ నిధుల్లో 30 శాతం కార్మికుల జీతభత్యాలకు, నీటి సరఫరాకు 15 శాతం, పారిశుద్ధ్యం నిర్వహణకు 15 శాతం, వీధిదీపాల నిర్వహణకు 15 శాతం, అంతర్గత రోడ్ల మరమ్మతులకు 20 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. పంచాయతీ సమావేశాలు, ఇతర ఖర్చుల కోసం 5 శాతం నిధులు వాడుకోవాలి. ట్రేడ్ లైసెన్సులు, జనన, మరణాల నమోదు, వివాహ ధ్రువీకరణపత్రాలు జారీ, గ్రామ రికార్డులు అప్‌డేట్ చేయడం వంటి బాధ్యతలను కార్యదర్శికి అప్పగించారు. ఇకపోతే పాలకవర్గాలు.. పరిశుభ్రత మొదలుకొని గ్రామాల అభివృద్ధి, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి. హరితహారం, స్వచ్ఛతతోపాటు గిరిజనులు, ది వ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై దృష్టిపెట్టాలి. ప్రతినెలా పంచాయతీ సమావేశం, రెండునెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించి, అభివృద్ధి పనులను గ్రామస్థులకు వివరించాలి. పబ్లిక్ రోడ్లు, వంతెనలు, కా ల్వల మరమ్మతు, తాగునీటి పైపులైన్ల ని ర్మాణం, నిర్వహణ, మురుగుకాల్వల నిర్వహ ణ, నిత్యం వీధులు శుభ్రపరచడం, పాడుబడ్డ బావులను పూడ్చడం, పబ్లిక్ టాయిలెట్ల ఏ ర్పాటు, చెత్త సేకరించి తడి, పొడి చెత్త వేరు చేయడం, డంపింగ్‌యార్డుల నిర్వహణతోపా టు వర్మీకంపోస్ట్ తయారుచేయడం వంటి బా ధ్యతలను పాలకవర్గాలకు అప్పగించారు. పా ఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు అ న్ని ప్రభుత్వ సంస్థల్లో పచ్చదనం, పరిశుభ్రత నిర్వహించాలి. ప్రతి వారం మురికికాల్వలు శుద్ధిచేయడం, ప్రతి 15 రోజులకు ఒకసారి దోమలను నియంత్రించే పనులు చేపట్టాలి.

జరిమానాలు.. వ్యయాలు

నివేశన స్థలాలు, ఖాళీ స్థలాలు, రోడ్లు, పబ్లిక్ ప్రాంతాలను అక్రమించేవారికి జరిమానా విధించే అధికారం పాలకవర్గాలకు కట్టబెట్టారు. ధర్మాదాయం, ట్రస్టుల నుంచి నిధులు సేకరించడం, సర్వీసు ఇనాంలపై శిస్తు వసూలు, మత్స్యక్షేత్రాల నుంచి పన్ను వసూలు, పెద్ద, చిన్న తరహా ఖనిజాల తవ్వకాలపై సీనరేజీ వసూలు చేసి గ్రామాభివృద్ధికి వినియోగించాల్సిన బాధ్యత పాలకవర్గానిదే. పంచాయతీ సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులను సూచిస్తూ నిధులు విడుదల చేసుకొనే అధికారం పాలకవర్గాలకు ఉన్నది. ప్రభుత్వం అనుమతితో పంచాయతీ నిధులను దేశరక్షణ నిధికి ఇవ్వవచ్చు. బీదలు, అనాథలు, నిరుపేదలు, వ్యాధిగ్రస్థులకు సహాయంచేసే అవకాశం కల్పించారు. అలాగే, ప్రభుత్వ నిధులు, ఆర్థిక సంఘం నిధులు, బీఆర్‌జీఎఫ్, ఇతర ప్రభుత్వ నిధులను నియమ నిబంధనలను అనుసరిస్తూ వెచ్చించాల్సి ఉంటుంది.

3868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles