సాధారణస్థితికి ప్రజారవాణా

Fri,November 8, 2019 02:40 AM

-పల్లెపల్లెకూ వెళ్తున్న బస్సులు
-గురువారం తిరిగిన 6,459 సర్వీసులు
-విధుల్లో 11వేల మంది తాత్కాలిక సిబ్బంది

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్: సమ్మె కారణంగా చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ప్రజారవాణా సాధారణస్థితికి చేరుకొన్నదని ఆర్టీసీ ఉన్నతాధికారులు గురువారం ప్రకటించారు. పల్లెలు, పట్టణాలకు అనుసంధానం ఉండేవిధంగా, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులను నడిపిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. పలుచోట్ల ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అప్పటికప్పుడు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. గురువారం సాయంత్రం 5 వరకు 11 వేల మంది తాత్కాలిక సిబ్బందితో మొత్తం 6,459 బస్సులు నడిచినట్టు సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ కిరణ్ తెలిపారు.

కరీంనగర్ రీజియన్‌లో..

కరీంనగర్ రీజియన్ పరిధిలో గురువారం 471 ఆర్టీసీ, 194 అద్దె బస్సులతో కలిపి మొత్తం 665 బస్సులు నడిచాయి. వరంగల్ రీజియన్‌లోని తొమ్మిది డిపోల నుంచి మొత్తం 826 బస్సులకు గాను 716 బస్సులు, నిజామాబాద్ రీజియన్‌లో 476 బస్సులు, ఆదిలాబాద్ రీజియన్‌లోని ఆరు డిపోల్లో 459 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. మెదక్ రీజియన్‌లో 535 బస్సులు ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేశాయి. ఖమ్మం జిల్లాలోని మూడు డిపోల పరిధిలో 293 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 217 బస్సులు 56 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. నల్లగొండ జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో 288 బస్సులు 80 వేల మందికిపైగా ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించాయి. సూర్యాపేట డిపో నుంచి 107, కోదాడ నుంచి 74 బస్సులు వివిధ ప్రాంతాలకు తిరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోనుంచి 146 సర్వీసులు తిరిగాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 374 బస్సులు నడిచాయి. వికారాబాద్ జిల్లాలో 203 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి.

ప్రభుత్వం చర్చలకు పిలవాలి

తమను చర్చలకు పిలవాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పిన ఆయన, ప్రభుత్వం పిలిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.

ఆర్టీసీ కార్మికులపై కేసు

కోరుట్లటౌన్: జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ డిపోలో విధుల్లో చేరిన మహిళా ఉద్యోగి చిత్రపటంతో అవమానకర రీతిలో ప్రవర్తిం చిన వ్యవహరించిన పలువురు ఆర్టీసీ కార్మికులపై పోలీసులు గురువారం కేసు నమో దుచేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ పిలుపుతో కోరుట్ల డిపోలో అసిస్టెంట్ మెకానిక్ ఇంజినీర్‌గా పని చేస్తున్న సంధ్యారాణి సమ్మె విరమించి ఈనెల 5న విధుల్లో చేరారు. ఈ క్రమంలో కార్మికులు సంధ్యా రాణి చిత్రపటంతో ఉన్న బ్యానర్‌ను డిపో ఎదుట ఏర్పాటు చేసి చెప్పులతో కొట్టడం, చెప్పుల దండ వేసి అవమానించారు. సంధ్యారాణి ఫిర్యాదు మేరకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ జీబీ సింగ్, బాలరాజు, అంజలి, జ్యోతి, ప్రభాకర్, చిరంజీవి, నారాయణ, ప్రభాకర్‌పై 188, 294బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

మేడ్చల్‌రూరల్: ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మేడ్చల్ మండలం డబిల్‌పూర్‌లో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. డబిల్‌పూర్ గ్రామానికి చెందిన షేక్‌బాబా(30) నగరంలోని రాణిగంజ్ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. షేక్‌బాబా బుధవారం రాత్రి నుంచి కన్పించకుండా పో యాడు. సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పలుచోట్ల వెతికినా ఫలితం లేకుండా పోయిం ది. గ్రామ పరిధిలోని బర్మాజీగూడకు వెళ్లే దారి పక్కన నిర్జన ప్రదేశంలో క్రిమి సంహారక మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని అటుగా వెళ్తున్న కొందరు చూసి షేక్‌బాబాగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అతడిని పేట్‌బషీరాబాద్‌లో పరిధిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నాడు.

2102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles