పల్లెపల్లెకూ బస్సులు

Sat,November 23, 2019 02:36 AM

-74.51 శాతం తిరిగిన సర్వీసులు
-మెరుగైన రవాణా సౌకర్యం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్: రవా ణా సౌకర్యం రోజురోజుకు మెరుగుపడుతున్నది. ఇప్పటివరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపిన ఆర్టీసీ అధికారులు షెడ్యూల్ ప్రకారం బస్సులు నడుపుతున్నారు. పట్టణాలు, మండల కేంద్రాలేగాకుం డా ప్రతి పల్లెకూ బస్సులు వెళ్లేలా చర్యలు తీ సుకుంటున్నారు. బస్సుల్లో అన్ని రకాల పాస్‌లను అనుమతిస్తున్నారు. శుక్రవారం సాయం త్రం 5 వరకు 74.51 శాతంతో మొత్తం 6,668 బస్సులను నడిపారు. ఇందులో 4,766 ఆర్టీసీ, 1,902 అద్దె బస్సులు ఉన్నా యి. కాగా పదకొండు వేల మందికిపైగా తాత్కాలిక సిబ్బంది విధులు నిర్వర్తించారని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

ఆయా రీజియన్లలో..

నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో శుక్రవారం 486 బస్సులు నడిచాయి. వరంగల్ రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో 866 బస్సులు ఉండగా శుక్రవారం 697 బస్సులు నడిచాయి. మెదక్ రీజియన్ పరిధిలోని 8 డిపోల నుంచి 523 బస్సులు నడిపారు. ఇందులో 371 ఆర్టీసీ, 152 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. కరీంనగర్ రీజియన్‌లో 668 బస్సులు రోడ్డెక్కాయి. నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని 7 డిపోల పరిధిలో 436 బస్సులు నడిచాయి. వికారాబాద్, తాండూరు, పరిగి డిపోల నుంచి శుక్రవారం 202 బస్సులు వివిధ ప్రదేశాలకు ప్రయాణికులను చేరవేశాయి.

మహబూబ్‌నగర్ జిల్లాలో 65 ఆర్టీసీ, 37 అద్దె బస్సులు నడువగా, దాదాపు 11వేలమందికిపైగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశాయి. నారాయణపేట జిల్లాలో 58 ఆర్టీసీ, 34 అద్దె బస్సులు తిరగ్గా, 7 వేల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 379 బస్సులు రోడ్డెక్కాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు మూడు డిపోల నుంచి 230 బస్సులు నడిచాయి. ఆదిలాబాద్ జిల్లాలో 228 బస్సులు నడువగా, రవాణా శాఖ అనుమతితో ప్రైవేట్ వాహనాలు కూడా తిరిగాయి.

గుండెపోటుతో డ్రైవర్ మృతి

-మృతదేహంతో పరిగి డిపో వద్ద కార్మికుల ఆందోళన
పరిగిరూరల్/పూడూరు: సమ్మెలో ఉన్న వికారాబాద్ జిల్లా పరిగి డిపో డ్రైవర్ వీరభద్రయ్య(40) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. కులకచర్ల మండలం మందిపాల్ గ్రామానికి చెందిన వీరభద్రయ్య పరిగి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు వికారాబాద్‌లోని మహవీర్ దవాఖానకు తరలించారు. వీరభద్రయ్యను అక్కడి డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుడికి భార్యతోపాటుగా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం బోరున విలపించింది.

కార్మికుల ఆందోళన..

వీరభద్రయ్య మృతదేహంతో కార్మికులు పరిగి బస్ డిపో వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న వివిధ సం ఘాలు, పార్టీల నా యకులు పెద్ద ఎత్తు న తరలివచ్చి వారి ఆందోళనకు మద్ద తు పలికారు. ఎస్పీ నారాయణ డిపో వద్ద కు వచ్చి కుటుంబ సభ్యులు, కార్మికులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యా యం చేసే విషయమై ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌లతోపాటు మరికొందరిని పోలీసులు పూడూరు మండలం హైదరాబాద్-బీజాపూర్ హైవే రోడ్డు మన్నెగూడ పోలీస్‌స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

1565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles